పోస్ట్‌లు

బుట్ట లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

బుట్ట భోజనం

బుట్ట భోజనo ఆ నగరానికి పనిమీద వచ్చిన వాళ్ళు ఎవరు ఆ భోజనశాలలో అడుగుపెట్టకుండా ఉండరు. ఆ ఆతిథ్యం స్వీకరించకుండా ఉండరు. కొసరి కొసరి వడ్డించే ఆ అమృతాన్ని తిని సంతృప్తిగా మెట్లు దిగుతారు. పుచ్చుకున్న దానికి రెండు రెట్లు ఎక్కువగానే పెట్టాడు అనుకుని ఆశీర్వదించి వెళ్తారు. సుమారు యాభై సంవత్సరాల నుంచి అందరి అధరాలకు అమృతాన్ని పంచి ఇచ్చిన ఆ భోజనశాల ఏమై ఉంటుందో ఊహించండి? ఆ నగరం పేరు చెప్పుకోండి చూద్దాం. ఒక చిన్న హింట్ ఇస్తాను. దాని పేరు బుట్ట భోజనం. అమ్మ చేతి వంటలా మురిపిస్తుంది. విందు భోజనాన్ని మరిపిస్తుంది. బుట్టలో ఒదిగి మీ ముంగిట వాలుతుంది. ఆ వీధి పేరు ఒక ప్రముఖ నటుడిది. ఆ భోజనశాల పేరు ప్రపంచానికి మార్గదర్శకమైన గీతను బోధించినవారి పేరు. ఈ బుట్ట భోజనం కాకినాడ మహానగరంలోని సుబ్బయ్య గారి హోటలు వారి ట్రేడ్ మార్క్..సుమారు 50 సంవత్సరాల క్రితం విద్యార్థులకి క్యారేజీలతో భోజనం సరఫరా చేసే ఒక చిన్న భోజనశాలగా నగరంలో అడుగుపెట్టి ఈనాడు రాష్ట్రంలోనూ పొరుగు రాష్ట్రంలోను శాఖలు పెట్టి ప్రజాదరణ చూరగొన్న సుబ్బయ్య గారు హోటల్ రుచికి మహారాజు, ఆతిథ్యానికి పెట్టింది పేరు. కాకినాడ మహానగరానికి వన్నెతెచ్చిన భోజన శాల....