అమ్మమ్మ గారి ఇల్లు
“రేపటి నుంచి నా కాలేజీకి సెలవులు!” అని ఉత్సాహంగా చెప్పాడు కిరణ్. “రేపు నేను అమ్మమ్మగారి ఊరికి వెళ్లిపోతున్నా” అనగానే, కిరణ్ మాటలు విని నవ్విపోయింది తల్లి సంధ్య. “కాలేజీకి సెలవిస్తే ఒక్కరోజు కూడా ఇక్కడ ఉండవు. అమ్మమ్మగారి ఊరు వెళ్తా అనావు. అక్కడ ఏముంది రా? నాకంటే నీకు అమ్మమ్మ ఎక్కువా?” అని అంది సంధ్య. “అవును అమ్మ! అమ్మమ్మ… కావాల్సినవన్నీ చేసిపెడుతుంది. ఆ రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రేమగా మాట్లాడుతుంది. ఆప్యాయంగా దగ్గర తీసుకుంటుంది. ఆ ఇల్లు చూస్తే స్వర్గంలా ఉంటుంది…” అని అమ్మమ్మ–తాతయ్యల గురించి చెప్పుకుంటూ ఆ రాత్రే నిద్రపోయాడు కిరణ్. --- మరుసటి ఉదయం మొదటి బస్సులోనే కిరణ్‌ని రావులపాలెం దగ్గర ఉన్న వాడపల్లిలోని అమ్మమ్మగారి ఇంటికి పంపించాడు తండ్రి రామారావు. సంధ్య తండ్రి పరంధామయ్య ఇంకా ఆ ఊరిలోనే ఉంటాడు. వృద్ధాప్యం వచ్చినా చిన్నపాటి వ్యవసాయం కౌలుకి ఇచ్చి రోజులు గడుపుతుంటాడు. పరంధామయ్యకి నలుగురు ఆడ పిల్లలు. మూడు అమ్మాయిలు హైదరాబాదులో ఉంటే, చిన్న కూతురు సంధ్య మాత్రం తునిలో ఉంది. సంధ్య భర్త రామారావు హంసవరం హైస్కూల్ హెడ్మాస్టర్. వారికి కిరణ్ ఒక్కరే కొడుకు. ఇంటి ముందు ఆగిన ఆటోలోంచి దిగిన కిరణ్‌ను...