పట్టాభిషేకం
శ్రీరామ పట్టాభిషేకం. అసుర సంహారం చేయడానికి దేవతల కోరిక మేరకు శ్రీమహావిష్ణువు దశరధ మహారాజుకు కొడుకుగా పుట్టి సకల శాస్త్రాలు విద్యలు నేర్చుకుని విశ్వామిత్ర మహర్షి యాగ సంరక్షణ చేసి జనక మహారాజు కొలువులో శివధనుర్భంగం చేసి సీతాదేవిని భార్యగా చేపట్టి అయోధ్య నగరానికి పట్టాభిషిక్తుడయ్యే సమయంలో పినతల్లి కోరిక మేరకు తండ్రి ఆజ్ఞ మేరకు నార చీరలు ధరించి అరణ్యవాసానికి వెళ్ళిపోతాడు. అరణ్యంలో ఉండగా మాయావి రావణాసురుడు సీతాదేవిని అపహరించి లంకకు తీసుకొని వెళ్ళిపోతాడు. వానర వీరుడు సుగ్రీవుడు సైన్యం సహాయంతో సముద్రాన్ని దాటి లంక నగరాన్ని చేరుకుని రావణ సేనతోయుద్ధం చేస్తూ అనేకమంది రాక్షసులను సంహరిస్తాడు. చివరిగా రావణాసురుడు తోటి తలపడతాడు. ఇలా భీకరంగా జరిగిన రామ రావణ యుద్ధంలో దశకంఠుడు శ్రీరామచంద్రమూర్తి చేతులో ప్రాణాలు కోల్పోతాడు. సమస్త దేవతలు ఆనంద ఉత్సాహాలతో పుష్ప వర్షం కురిపించారు. రామచంద్ర మూర్తికి అభినందనలు ఆశీస్సులు అందజేశారు విభీషణుడిని లంకా రాజ్యానికి అధిపతిగా చేసి రామచంద్రుడు అయోధ్య నగరానికి బయలుదేరుతానని తగిన ఏర్పాట్లు చేయమని కోరుతాడు . కాలినడకన అయోధ్యకు బయలుదేరడం చాలా శ్రమతో కూడుకున్న పని ...