పోస్ట్‌లు

రిటైర్మెంట్ లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

రిటైర్మెంట్ జీవితం

రిటైర్మెంట్ జీవితం. ఇటువంటివి బయటికి తెలిసిస్తే నలుగురిలోను తలెత్తుకొని తిరగలేము ఆడపిల్లలు కలవాళ్ళం. ఈ వయసులో ఆ బుద్ధులు ఏంటి ?అంటూ డైనింగ్ టేబుల్ వరకు వచ్చిన అత్తగారు వైపు తిరిగి పెద్ద కోడలు శాంత గట్టిగా అరుస్తోంది. నానమ్మ నువ్వేనా చెప్పు ఇది తప్ప కాదా !పెద్దవాళ్ళు పుస్తకం చదువుకో వాలి లేదంటే టీవీ చూడాలి. ఆస్తమాను ఆ మొబైల్ లో చాటింగ్ ఏమిటి నేను చూసాను కాబట్టి సరిపోయింది. నాన్న చూస్తే ఇంకా ఏమైనా ఉందా ఇంట్లో పెద్ద గొడవ అయిపోతుంది అంటూ పెద్ద మనవడు రఘు అచ్యుత రామయ్య గారి భార్య కామేశ్వరమ్మ గారితో చెపుతున్నాడు. నన్ను స్కూల్లో ఏడిపిస్తారు నానమ్మ అందరూ వేలెత్తి చూపిస్తారు తాతయ్య చేస్తున్న పనికి ఇప్పుడు మనవరాలు రమ్య ఒకటే గోల ఏమైందిరా అందరూ ఒకటే అలా గొడవ పెడుతున్నారు విషయం తెలియకుండా నా మీద అరిస్తే ఏమిటి ఉపయోగం. విషయం చెప్పండి నేను పరిష్కారం ఆలోచిస్తాను అంటూ చెప్తున్న కామేశ్వరమ్మ గారి మాటలు విని మనవడు రఘు అచ్యుతరామయ్యగారి రూమ్ లో నుంచి మొబైల్ ఫోన్ పట్టుకుని వచ్చి వాట్సప్ ఓపెన్ చేసి వాట్సప్ సందేశాలు చదవడం ప్రారంభించాడు. గుడ్ మార్నింగ్ తో ప్రారంభ మయ్యాయి సందేశాలు. ఇలాగా ఉదయం ప్రారంభమైన సందే...