జై వీర హనుమాన్
జై వీర హనుమాన్. ఆంజనేయస్వామి సర్వమానవ ఆరాధ్య దైవం. రామ బంటుగా రామ భక్తుడిగా, అసాధ్యకార్యసాధకుడుగా, రాక్షస సంహారిగా మన మనసులో నిలిచిపోయిన దైవం. భారతదేశంలో ఏ గ్రామం చూసిన ఏ రహదారి చూసిన స్వామి విగ్రహం లేని చోటు ఉండదు. దేవాలయంలో ఆంజనేయ స్వామిని చూసిన రహదారి పక్కనున్న విగ్రహాలు చూసిన ఒక రకమైన ఉత్తేజం ధైర్యం కలుగుతుంది. బహుశా ఆయన రూపం చూసి భయం తొలుగుతుంది. విశాలమైన వక్షస్థలం పొడవైన కాళ్లు చేతులు చేతిలో గధ వానర ముఖం వానరులకుండే ప్రత్యేకమైన అవయవం తోక కలిగి ఉంటారు స్వామి. మానవ రూపంలో ఉండే ఈ దేవుడుకి వానర ముఖం ఎక్కడి నుంచి వచ్చింది అనే ప్రశ్న అందరికీ కలుగు తుంది. ఆంజనేయ స్వామి తల్లి అంజనీ దేవి. ఆమె వానర వనిత. ఆంజనేయ స్వామి తల్లి అంజనీదేవి పూర్వ జన్మలో ఒక అప్సరస శాపం కారణంగా వానర కన్యగా పుడుతుంది. ఆమెకు కేసరితో వివాహం జరుగుతుంది. చాలా కాలo వరకు సంతానం కలగపోవడంతో శివుడుని పూజించి శివుడు లాంటి కొడుకు కావాలని కోరుకుంటుంది. శివుడి యొక్క తేజమును వాయుదేవుడు పండు రూపంలో అంజనీ దేవికి ఇవ్వగా ఆ పండు తిన్న అంజనీ దేవికి ఆంజనేయ స్వామి జన్మిస్తాడు. అంజనీ దేవి పుత్రుడు కాబట్టి ఆంజనేయ...