మానవ నైజం
ఊపిరి ఉన్న మనిషి నీ మనలో ఒకడిగా కలుపుకో ము. ప్రేమగా పలకరించము ఆత్మీయంగా దగ్గరకు తీసుకో ము. వయసుకు గౌరవం ఇవ్వము. జారి పడిపోతున్నా చెయ్యి అందించము ఊపిరి ఆగిపోయిన ఆ మనిషికి ప్రదక్షిణాలు చేస్తాము చేతులెత్తి మొక్కుతాము అలంకరణలతో ముంచేస్తాము అనుభవాలు అనుబంధాలు అప్పుడే గుర్తు చేసుకుంటాము నలుగురితో పాటు నారాయణ కులంతో పాటు గోవిందా మనకు వచ్చే కన్నీళ్లు కూడా అంతే. అవి గుండె పంపే కన్నీళ్లు కాదు. ఆ తెర మీద నటించేసాం అయిపోయింది ఇంకో పాత్రకి నటుడుగా మారిపోతాం. రోజు ఎన్నో పాత్రలు ఎన్నో వేషాలు ఈ లోకమే ఒక రంగస్థలం ఏ పాత్రకైనా మానవ వేషం ఒకటే. కొత్త రంగులు వేసుకోనక్కర్లేదు. ఇది నడుస్తున్న మన జీవితం. కాదు కాదు నటిస్తున్న జీవితం. రచన మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు కాకినాడ 9491792279