మానవ నైజం



ఊపిరి ఉన్న మనిషి నీ
మనలో ఒకడిగా కలుపుకో ము.
ప్రేమగా పలకరించము

ఆత్మీయంగా దగ్గరకు తీసుకో ము.
వయసుకు గౌరవం ఇవ్వము. 
జారి పడిపోతున్నా చెయ్యి అందించము

ఊపిరి ఆగిపోయిన ఆ మనిషికి 
ప్రదక్షిణాలు చేస్తాము
చేతులెత్తి మొక్కుతాము

అలంకరణలతో ముంచేస్తాము
అనుభవాలు అనుబంధాలు 
అప్పుడే గుర్తు చేసుకుంటాము

నలుగురితో పాటు నారాయణ
 కులంతో పాటు గోవిందా
మనకు వచ్చే కన్నీళ్లు కూడా అంతే. 
అవి గుండె పంపే కన్నీళ్లు కాదు.

ఆ తెర మీద నటించేసాం అయిపోయింది 
ఇంకో పాత్రకి నటుడుగా మారిపోతాం. 

రోజు ఎన్నో పాత్రలు ఎన్నో వేషాలు 
ఈ లోకమే ఒక రంగస్థలం 
ఏ పాత్రకైనా మానవ వేషం ఒకటే. 
కొత్త రంగులు వేసుకోనక్కర్లేదు.

ఇది నడుస్తున్న మన జీవితం.
కాదు కాదు నటిస్తున్న జీవితం. 

రచన మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు 
కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట