పోస్ట్‌లు

ఎండలు లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ఎండలు

బాబోయ్ ఎండలు ఎండలు బాబోయ్ ఎండలు. ఎవరి నోటి విన్నా ఇదే మాట. ఎండాకాలంలో ఎండలు కాయక వానలు కురుస్తాయా అని కొందరు అంటారు. కాదు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పెరిగేయి అంటూ ప్రతి సంవత్సరం ఒకటే గోల. ప్రతి ఏటా సూర్యుడు కిందకి దిగిపోతున్నాడు. భూలోకం మీద అంత మమకారం ఎందుకో.ఏ నోట చూసినా అదే మాట. ఏ పని చేయబుద్ధి కాదు. తీక్షణమైన ఎండ చూస్తే వికారం. ఇంట్లో కూర్చున్న చెమటలు. గాలి లేదు. ఫ్యాన్ గాలి తప్పితే. ఏసీ గది వదిలి రా బుద్ధి కావడం లేదు.  అలా అని చెప్పి ఇంట్లో కూర్చుంటే జీవితం ఎలా నడుస్తుంది. మూడు చక్రాల బండి స్టీరింగ్ తిప్పితే గాని తన బతుకు గడవదు ఒకరికి. నడి నెత్తి మీదకి సూర్యుడు వచ్చినా పొలం గట్ల మీద కలుపు మొక్కలు పీకక పోతే డొక్క నిండదు ఒకరికి. సర్కారు నౌకరు అయిన ఊరికే కూర్చోబెట్టి జీతం ఇవ్వరు కదా. పగలంతా ఏదో ఒక పని చేయవలసిందే. పిల్లలకి స్కూలు సెలవిచ్చిన అమ్మకి వంట పని తప్పుతుందా. ఏ జీవన చక్రాన్ని ఆపలేం. అలా నడుస్తుంటేనే నాలుగు వేళ్ళు లోపలికి పోతాయి ఎవరికైనా సరే. ఏ స్థాయి వాళ్ళకైనా సరే. మరి ఇంత ఎండలో ఆ ఊరు నుంచి ఈ ఊరికి జనాలను మోసుకుపోయే, సరుకులు తీసుకుపోయే లారీలు బస్సులు రైళ్లు విమానాలు నడిప...