మాకు మనసు ఉంటుంది 👨‍⚕️🏥

అంశం : మాకు మనసు ఉంటుంది.

నిత్యం మాకు కత్తుల తోటే యుద్ధం
రాజ్యాల కోసం పోరాడే రాజులo కాదు
ప్రాణాలు కాపాడే వైద్యులo

అనుభవంతో చేయి పట్టుకోగానే
 చేయి దాటిపోతున్నాడని చెప్పగలం.
రాగల ప్రమాదం ముందే పసిగట్టగలం
మొండి రోగానికి మందు వేయగలo

కొన ఊపిరితో ఉన్న వాళ్ళని
హుషారుగా నడిచేలాగ చెయ్యగలం.
పోయే ప్రాణం గురించి ముందుగా చెప్పగలం.
కానీ ఆ ఒక్కటి అడక్కండి 
ప్రాణం మటుకు పోయలేము.

వైద్యో నారాయణ హరి బిరుదులన్నీ మాకే
ఆ బిరుదుల మాటున హరిదాగున్నాడని మాకు తెలుసు.

మా చేతిలోంచి జారిపోయిన ప్రతి చెయ్యి
మా గుండెల్లో కలతలు రేపుతుంది.
మనసు కకావికలం అవుతుంది
నిర్జీవమైన కళ్ళు మమ్మల్ని ప్రశ్నిస్తున్నట్లుగా ఉంటాయి.
బంధువుల కళ్ళల్లోకి సూటిగా చూడలేo
నోటి తోటి అప్రయత్నంగా చెప్పే సారీ తప్పితే
నిత్యం ఏదో ఒక మరణం
యాంత్రికమైపోయింది మా జీవనం.
మరణం తప్పించాలని చేస్తాము రణం
దైవఘటన ముందు పోరాడి ఓడిపోతాం.

మా కన్నీటి బొట్లు ఎవరికీ కనబడవు
మాకు మనసు ఉంటుంది
మనసు మౌనంగా రోదిస్తుంది.
మేము కూడా మనుషులమే

నిర్జీవమైన శరీరాన్ని ముక్కలు
ముక్కలుగా నరికి అతుకుతాం.
వృత్తి ధర్మం ఏం చేస్తాం

గోరుముద్దలు తినిపించిన కన్నతల్లి కావచ్చు
విద్యాబుద్ధులు నేర్పిన గురువు శరీరం కావచ్చు
ఆప్త బంధువు కావచ్చు ఆత్మీయుడు కావచ్చు
ప్రాణమిచ్చే స్నేహితుడు కావచ్చు
ఎవరినైనా కత్తులతో కోయవల్సిందే
నిజాల నిగ్గు తేల్చవలసిందే
మాకు నిత్యం స్మశాన వైరాగ్యమే.
రోగులందరూ మమ్మల్ని దేవుళ్ళు అంటారు.
దేవుడికి కూడా మనసు ఉంటుంది.
మేము ప్రాణాలు కాపాడే వైద్యులు మాత్రమే.
తలరాతను మార్చే దైవo మాత్ర కాదు.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.
          కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆరోగ్యం వర్సెస్ ఆహారపు అలవాట్లు

కుటుంబం

సాయంకాలం సాగర తీరం