8+8+8 రూల్

 ప్రతి మనిషి జీవితంలో కాలం చాలా విలువైనది. ఒకసారి గడిచిపోయిన కాలం మళ్ళీ తిరిగి రాదు. ప్రతి ఒక్కరూ కాలం విలువ గమనించి సద్వినియోగం చేసుకునే దిశలో మనం ముందుకు సాగాలి. ఒక రోజంటే 24 గంటల సమయం. ఇది అందరికీ సమానమే. అయితే దాన్ని ఉపయోగించుకునే విధానంలోనే మనిషికి మనిషికి తేడా ఉంటుంది. ప్రతి వ్యక్తికి ఎనిమిది గంటల నిద్ర చాలా అవసరం. ప్రతి వ్యక్తి బ్రతకడానికి ఏదో ఒక  వృత్తి చేయవలసి ఉంటుంది. దానికి ఎనిమిది గంటల సమయం కేటాయించుకోవాలి. ఇకపోతే ఒక రోజులో మిగిలినది 8 గంటల సమయం. ఈ ఎనిమిది గంటల సమయాన్ని తన కుటుంబం తోటి, స్నేహితుల తోటి, మత విశ్వాసాలతోటి, హాబీల తోటి, శారీరక ఆరోగ్యం కోసం నడక, పరిగెత్తడం, ఎక్సర్సైజులు చేయడం వంటి వాటి కి కేటాయించాలి. అప్పుడు కాలం సద్వినియోగం అవుతుంది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట