మలి సంధ్య

మలి సంధ్య 

 నాడు నేను నీకు నవమాసాలు కని పెంచిన బిడ్డని
నవనాడులు కుంగిపోయి నేడు నీవు నాకు అయ్యావు బిడ్డగా.
పురిటినొప్పులు లేని దేవుడిచ్చిన పసిబిడ్డవి.

   నీది పేగుబంధం    
   నాది మాతృ రుణం.
  నాకు అమ్మవే నిన్ను పసిబిడ్డలా మార్చింది కాలం.

       నీ కాలంలో నువ్వే నా కలల రాణివి.
       ఇప్పుడు మనిద్దరి శరీరాలు ఒక్కటే
       ఇంటి పేరు వేరు.

        అమ్మా నా చిన్నతనం గుర్తు వస్తోందా నీకు
   చెల్లి నీచంకలో, 
   నీ కొంగు పట్టుకుని నేను
  ఇప్పుడు నా చంటిది చంకలో ,
  నీమంచం పక్కన నేను

పసితనంలో ఆనందంగా నువ్వు చేయించే స్నానం
నేను నీకు ప్రతిరోజు చేస్తున్నాను కన్నీళ్లుతో అభిషేకం 
అమ్మ ఎందుకిలా మారింది అని..

అగరుతో గుండ్రంగా నుదుటిన బొట్టు పెట్టి మురిసిపోయే అమ్మకి
చుక్కలు లేని ఆకాశంలా ఉండే నుదురు మీద రవ్వంత విభూది బొట్టు.

తలుపు చాటు వెళ్లి నేను వెక్కి వెక్కి ఏడ్చిన క్షణం.
 అది చూసిన నా ఓదార్పుకు సహకరించలేని నీ శరీరం

నా చిట్టి చేతులు తన బుగ్గలు ఆనించుకుని 
మైమరిచిపోయిన అమ్మ 
ఆ చేతులతో అమ్మ నోటికి ముద్దలు తినిపించే క్షణం.

అమ్మా నా చిన్నతనం గుర్తొస్తుందా నీకు .
బజార్లో రకరకాల డ్రెస్సులు కొని తొడిగి మురిసిపోయేవు
ఆనాడు.
Nightdress కూడా శరీరానికి బరువే అంటున్నావు ఈనాడు.

నాన్న ఉన్నన్నాళ్లు గుమ్మం దాటి రావడమే గగనం.
ఇప్పుడు నాకు నువ్వు మంచం దిగడమే అంబరం.

ప్రతిరోజు పంచభక్ష పరమాన్నాలతో కడుపునింపావు.
గుక్కేడు నీళ్లు గొంతులో దిగడమే గగనం నీకు ఈనాడు.

  అమ్మ లక్క పిడతల బొమ్మ
     రోజు బొమ్మ తోటి బువ్వలాట.

 రోజు ఆడుకుంటాను లక్కపిడతలతో ఆనందంగా ,
రంగు వెలిసిపోయాయని గుమ్మం దాటిoచకుండ. 

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.
         కాకినాడ
   9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆరోగ్యం వర్సెస్ ఆహారపు అలవాట్లు

కుటుంబం

సాయంకాలం సాగర తీరం