రహదారి భద్రత



భద్రం కొడుకో రహదారి మీద సాగేటప్పుడు !
భద్రం చెల్లెమ్మ వాహనం నడిపేటప్పుడు !

అది రహదారి 
మందిని గమ్యం చేర్చే ప్రభుత్వ దారి 

ఆటలు ఆడే 
మైదానం కాదు

విన్యాసాలు ప్రదర్శించడానికి
మన ఇల్లు అసలే కాదు

మూడు కాలాలలోనూ ముక్కంటి లా 
 రహదారి మీద కాపాడే
పోలీస్ అన్న ఆజ్ఞలు పాటించు 
బాధ్యత గుర్తెరిగి భద్రంగా ఇంటికి తిరిగి రా !

లైసెన్స్ అడిగితే సైలెంట్ అయిపోకు.
నోట్ల కట్ట చూపించి తప్పుని ఒప్పు చేయకు. 

రహదారి నియమాలు 
తెలుసుకుని ముందుకు కదులు

అది తెల్ల చారల గుర్రం కాదు 
పాదచారులను భద్రంగా రహదారి దాటించే మార్గం. 

మితిమీరిన వేగం మన లక్ష్యం కాదు 
సురక్షిత గమ్యం మన ఆశయం 

మార్గంలో వేగం పరిమితి తెలుసుకో 
విలువైన ప్రాణం కాపాడుకో

కుడి ఎడమలు మర్చిపోకు
ఎడమవైపు ప్రయాణమే 
ప్రభుత్వ ఆదేశం

 రహదారి సంకేతాలు 
మన పాలిట వరాలు. 

ఎరుపు రంగు సంకేతం 
మన ముందరకాళ్లకు బంధం 
అడుగు ముందుకు వేయాలంటే 
ఆకుపచ్చ రంగు పడవలసిందే.

సూటు బూటు కాదు 
రెండు చక్రాల బండి ఎక్కితే 
శిరోరక్షణ కవచం ముఖ్యం 

జోరుగా హుషారుగా 
 షి తో కారులో పోతున్న 
గుండెలపై పట్టి బిగిస్తే 
బతుకంతా సేఫ్టీ 

ఫోను చేతిలో ఉంటే 
దారి మాయమవుతుంది 
చిన్న తప్పుకి పెద్ద శిక్ష 

ముందుకు దూసుకుపోవడం ముఖ్యం కాదు 
విలువైన ప్రాణం కాపాడుకోవడం మన లక్ష్యం .

జీవితం ఒక్కటే – అందమైన వరం,
జాగ్రత్తలే దానికి రక్షణ కవచం.
రూల్స్ పాటించు, మార్గం మించినవి కాక,
ప్రతి ప్రయాణం అంగీకారంగా మార్చుకో భద్రతగా.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు 
కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట