కోరిక
కోరిక
అది రద్దీ ఎక్కువగా ఉండే రాజధానినగరంలోని ఒక వీధి లో
ఉండే హోటల్ ప్రాంగణం. సుమారుగా 80 సంవత్సరాల నుండి
ఆ హోటల్ అదే వీధిలో ఉంది. భోజనం హోటల్స్ చాలా
ఉంటాయి. కానీ కస్టమర్ల్ని ఆదరించి ఆప్యాయంగా కొసరి
కొసరి వడ్డించి సంతృప్తిగా భోజనం పెట్టే ఆ హోటల్ ఒక్కటే.
అందుకే దూరప్రాంతాల నుండి వచ్చినవారు తప్పనిసరిగా ఈ
హోటల్ లో భోజనం చేసి వె డతారు.
చక్కగా అరిటాకు వేసి వడ్డించి తెలుగువారి భోజనం పెట్టె
ఏకై క భోజనశాల. కమ్మగా వేయించిన కందిపప్పు పప్పులోకి ఒక చిన్న పాత్రలో వేడివేడి నెయ్యి పనసపొట్టు కూర గుత్తి వంకాయ మజ్జిగ పులుసు గోంగూర పచ్చడి గడ్డ పెరుగు
ఆవకాయ దప్పుళo ఆకులో మెరిసిపోతూ ఆకాశంలోని హరి విల్లులా ఉంటాయి. ఆకు చూడగానే నోరూరిపోతుంది. నోట్లో పెట్టుకోగానే చేతులెత్తి మొక్కాకనిపిస్తుంది. అందుకే ఎక్కడ లేని రద్దీ.
ఎప్పటిలాగే ఆరోజు కూడా హోటల్ ప్రాంగణం చాలా రద్దీగా
ఉంది. లంచ్ సమయం కావడంతో సీట్లు ఖాళీ లేక కస్టమర్లు
వెయిటింగ్ హాల్లో కూర్చున్నారు. వెయిటర్లు అటు ఇటు
బిజీబిజీగా తిరుగుతూ వచ్చిన కస్టమర్లకు ఏం కావాలో
చూస్తున్నారు. ఆ హోటల్ యజమాని ప్రతి టేబుల్ దగ్గరికి వెళ్లి కస్టమర్ ని ఆప్యాయంగా పలకరిస్తున్నారు .
క్యాషియర్ బిల్లుతీసుకోవడంలో బిజీ బిజీగా ఉన్నాడు. ఇంతలో యధాలాపంగా క్యాషియర్ రాము వీధి గుమ్మం వైపు చూసాడు. ఒక స్త్రీఐదుగురు పిల్లలతో చేతిలో గిన్నెతో ఆశగా ఆ హోటల్ వైపుచూస్తున్నారు. చిరిగిన దుస్తులు చింపిరి జుట్టు దుమ్ము
కొట్టుకుపోయి బక్క చిక్కిన శరీరంతో నోరు విడిచి ఏమీ
అడగడం లేదు. రోజు 12 గంటల సమయానికి హోటల్
ముందు అరగంట సేపు నిలబడతారు.
ఇంచుమించుగా నెలరోజుల నుండి ఇదే పరిస్థితి. చూడగానే ముష్టివాళ్లని అర్థమవుతుంది కానీ ఆ మార్కెట్లో ముష్టి వాళ్లువారానికిఒక్కరోజే వస్తారు. అది ఆ ఊరి కట్టుబాటు. అయినా కౌంటర్లో ఒక రూపాయితీసివారికిఇచ్చిపంపించేయమని వెయిటర్ చెప్పాడు. వెయిటర్ వాళ్ళ దగ్గరికి వెళ్లి రూపాయి ఇచ్చిన వారు తీసుకోలేదు. అయితేవీరి పరిస్థితి ఏమిటో తెలుసుకోవాలి అని రాము తనలో తాను అనుకుంటూ క్యాష్ కౌంటర్ని పక్కస్నేహితుడికి అప్ప చెప్పి మెట్లు దిగి వాళ్ళ దగ్గరికి వచ్చాడు.
అమ్మా మీకు ఏం కావాలి అంటూ ప్రశ్నించాడు. ఆ తల్లి కన్నీళ్లు
పెట్టుకుంటూ తన గోడు చెప్పసాగింది. అయ్యా మేము
బిచ్చగాళ్ళం. ప్రతి ఊర్లోనే అడుక్కుంటూ ఇలా నెల రోజుల
క్రితం ఈ ఊరు వచ్చాం. వచ్చినప్పటి నుంచి మా పిల్లలు మీ
హోటల్లో భోజనం చేయాలని నన్ను చంపుకుని తింటున్నారు.
మాకు అంత ఆర్థిక స్తోమత లేదు. ఉన్నా మమ్మల్ని లోపలి కి
రానీయరు. మళ్లీ మేము ఈ ఊరు విడిచి వెళ్ళిపోతాం.
అందుకునే నెల రోజుల నుంచి క్రమం తప్పకుండా మీ హోటల్
ముందు నిలబడుతున్నాం. ధర్మ ప్రభువులు ఎవరైనా
దయతలుస్తారేమోనని అంటూ ముష్టిది చెప్పసాగింది.
క్యాషియర్ రాముకి కన్నీళ్లు ఆగలేదు. మీరు ఇక్కడ ఉండండి
అంటూ యజమాని దగ్గరికి వెళ్లి విషయం అంతా చెప్పాడు.
యజమాని కూడా వెంటనే స్పందించి వారిని లోపలకు రమ్మని
పిలిపించాడు.
ఆ ముష్టిది ఐదుగురు పిల్లలు లోపలికి అడుగు పెట్టి టేబుల్ దగ్గర కూర్చున్నారు. సర్వర్ వచ్చి పదార్థాలన్ని వడ్డించాడు . పాపం వారికి రకరకాల కూరలు పచ్చళ్ళు అరిటాకులో చూడగానే నోరూరిపోయింది. ఏదోరకంగా కడుపు నింపుకునేవారు కానీ తృప్తిగా భోజనం చేసిన రోజు లేదు. తల్లి పిల్లలు ఆవు రావురు మంటూ తిన సాగా రు .మధ్యలో యజమాని వచ్చి కొసరి కొసరి వడ్డించారు. మిగిలిన
కస్టమర్లు ఆశ్చర్యంగా వారికేసి చూస్తున్నారు. భోజనం
అయిపోయిన తర్వాత ఆ ముష్టిది ఐదుగురు పిల్లలు యజమాని కాళ్ళ మీద పడ్డారు. వాళ్ల కళ్ళల్లో తీరని కల
తీరిందనే ఆనందంకనబడింది. వెంటనే క్యాషియర్ రాము తన జేబులో నుంచి 200 రూపాయి నోటు తీసి యజమానికి ఇవ్వబోయాడు యజమానికి పరిస్థితి అర్థం అయింది. నవ్వుతూ ఆ నోటు వెంటనే రాము జేబులో పెట్టేసాడు.
రాము కళ్ళల్లో నీళ్లు తిరిగాయి
డబ్బు ప్రధానంగా నడుస్తున్న ఈ కలికాలంలో ఇటువంటి వ్యక్తులు ఉండడం చాలా అరుదు అనుకుంటూ తన పనిలోనే నిమగ్నం అయిపోయాడు.
కార్లోంచిదిగేవాళ్ళనిఒకరకంగానూ స్కూటర్ మీద వచ్చేవాళ్ళని ఒకరకంగానూ నడిచి వచ్చే వాళ్లను మరొక రకంగాను పలకరించే తీరులో మార్పు ఉంటుంది. అయితే ఇటువంటి బిచ్చగాళ్లను ఆదరించి కడుపునిండా అన్నం పెట్టి వారి చిరకాల కోరిక తీర్చిన
యజమానిని మిగిలిన కస్టమర్లు అంతా అభినందించారు.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి