త్యాగమూర్తులు

త్యాగమూర్తులు

వీరికి గుడులు గోపురాలు ఉండవు

ఎగిరే మువ్వన్నెల జెండాలో అందరికీ మూడు రంగులే
కనిపిస్తాయి.

మనసుపెట్టి చూస్తే అమరవీరుల ఆశయాలు కనిపిస్తాయి.
అసువులు బాసిన అమరవీరులందరి ఆశయాలకు గుర్తులుగా
 ఎర్రకోట పై రెపరెపలాడుతోంది మూడు రంగుల జెండా .

ఆ మహనీయుల అందరి ఆశయం ఒక్కటే. దేశాన్ని విదేశీ సంకెళ్ల నుండి విడిపించడమే. ఎవరికి నచ్చిన మార్గం వారు ఎంచుకొని పరాయి పాలన ఎదిరించి స్వాతంత్ర సమరయోధులుగా చరిత్రలో మిగిలిపోయారు. 

ఈనాడు ఇలా స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నామంటే
ఆనాడు ఎందరో వీరుల ఊపిరి ఆగిపోయిమట్టిలో కలిసిపోయి మహనీయులుగా మిగిలిపోయారు. వారు స్వాతంత్ర ఫలముఅనుభవించలేదు. పదవుల కోసం ఆశపడలేదు. బ్రతికున్న రోజుల్లో కారాగార శిక్ష అనుభవించి ఉరికంబo ఎక్కి అసువులు బాసిన మహాత్ములు. 

అహింసావాదంతో గాంధీజీ బ్రిటిష్ వారిని గడగడలాడిస్తే
బంకించంద్ర చటర్జీ వందేమాతర గీతం రవీంద్రనాథ్ ఠాగూర్ జనగణమన గీతం రచించి జాతిని ఉత్తేజపరిచారు. దేశభక్తి ఉప్పొంగించారు. మరికొందరు ఆనాడు సమాజంలో ఉన్న సతీసహమగమనాన్ని బహు భార్యత్వాన్ని ఎదిరించి ప్రజలలో చైతన్యం తీసుకొచ్చి రాజా రామ్మోహన్ రాయ్ గా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. సుభాష్ చంద్రబోస్ లాంటి వీరులు సాయిధ పోరాటాన్ని నమ్మి బ్రిటిష్ వారిని ఎదిరించి మనకు స్ఫూర్తిగా నిలిచారు. మన ఆంధ్రావీరుడు అల్లూరి మన్యం ప్రజలను కూడగట్టుకుని తెల్లదొరలను ఎదిరించి తుపాకీ గుళ్ళకు బలైపోయాడు. దేశంలోని ప్రతి గ్రామంలోనూ ప్రతి రాష్ట్రంలోనూ ఈ మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని ఎందరో వారికి తోచిన రీతిలో స్వాతంత్ర సంగ్రామం లో పాల్గొని జైలు శిక్షలు అనుభవించి ఆస్తులు పోగొట్టు కొని మనకు ఆదర్శమూర్తులుగా నిలిచారు.
ఈనాడు ఇలాపార్కులలోనూ ప్రతి వీధిలోను నాలుగు రోడ్ల కూడలిలోనూ మనకు నిత్యం దర్శనమిస్తుంటారు. వీరికి గుడులు గోపురాలు ఉండవు. ధూప దీప నైవేద్యాలు ఉండవు. ఎండలో ఎండుతూ వానలో తడుస్తూ ప్రతి వీధిలో ను మనల్ని పలకరిస్తుంటారు. దారితప్పిన దానయ్యలకి ల్యాండ్ మార్క్ గా ఉండి దారి చూపిస్తారు. ఆ వీధులకి ఆ మహావీరుల పేరెట్టుకుని జనంమురిసిపోతుంటారు.బాధ్యతతీరిపోయిందిఅనుకుంటారు. భరతజాతి ఊపిరి ఉన్నంత కాలం ఆ బాధ్యత తీరదు. అది తీర్చలేని రుణం .తీర్చుకోలేని రుణం. ప్రాణం కన్నా విలువైనది ఏదీ లేదు. అటువంటి ప్రాణాన్నే త్యాగం చేసిన త్యాగమూర్తులు .

ప్రతి ఋతువు వీరిని పలకరిస్తూనే ఉంటుంది. దారిన దర్జాగా పోయే వాహన కాలుష్యం కాటేస్తూనే ఉంటుంది. అయినా చిరునవ్వు చిందిస్తూనే ఉంటారు. జ్ఞానం లేని పక్షికి ఏమి తెలుసు
గాల్లోఎగురుతూఆసరాదొరికిందనితనఅవసరంతీర్చుకుంటుంది. నోట కరిచి తెచ్చుకున్న ఆహారం అక్కడ జారవిడుస్తుంది.

పండగలకి పబ్బాలకి కి చిత్తుగా తాగి గాంధీ బొమ్మనంతా గలీజ్ చేసి ఒళ్ళు తెలియకుండా పడుకునే ప్రబుద్ధులను నిత్యం మనం చూస్తూనే ఉంటాం. మత్తు వదిలిన తర్వాత దులుపుకొని వెళ్ళిపోతారు తప్పితే గలీజుని శుభ్రం చేయడానికి ఎవరు ముందుకు రారు. మద్యపాన నిషేధానికి నడుము కట్టిన గాంధీజీ పుట్టిన దేశం. ఒక క్షణం బాధగా ఉంటుంది.

ఇకపోతే క్షణికావేశంతో లేచే కొట్లాటలు దొమ్మీలు స్ట్రైకులలో ముందుగా బలయ్యేది ఈ విగ్రహాలే. చెప్పుల దండలు వేసి అవమానించడం సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం. ఆవేశం తగ్గాక ఆలోచించుకుంటే ఎంత తప్పోప్రతి ఒక్కరికి తెలుస్తుంది. 

ఈ రకమైన సమస్యలు ప్రతి ఊరిలోనూ సర్వసాధారణంగా చూస్తుంటాం. సమాజంలో ఉన్న మేధావులు రాజకీయవేత్తలు విజ్ఞులు దీనికి పరిష్కారం కనుగొనే దిశగా ఆలోచిస్తే చాలా బాగుంటుంది. ఆ మహా మనుషులను మనం గౌరవించినట్లు అవుతుంది.
జై హింద్

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
          కాకినాడ 9491792279

  

ఓం

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆరోగ్యం వర్సెస్ ఆహారపు అలవాట్లు

సామర్లకోట

కుటుంబం