ఒక టీ కప్పు ప్రయాణం

ఒక టీ కప్పు ప్రయాణం.

నీలగిరి కొండల్లో పుట్టింది. నీలిరంగు కప్పు లో ద్రవమై
 వచ్చింది. మత్తును వది లించింది. మధుర పానీయమై వెలుగొందింది. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరు ఏమి?నా పేరు తేనీరు నా మేనిఛాయ బంగారు. నేను లేకపోతే అందరికీ కంగారు.

ఉత్సాహానికి ఉల్లాసానికి మారుపేరు తేనీరు.తేనీరు తాగితే మనిషి మానసికస్థితి మారు.తెల్లారి లేచింది మొదలు పొద్దుగూకే వరకు కప్పు మీద కప్పు ఇస్తుంది మన వాడికి ఒక కిక్కు.
చుక్క లేకుండా బండి నడవదు అంటాడు ఒకడు.గుటక గుటక లో రుచి చార్మినార్ టీ అంటాడు ఒకడు. పుర్రెకో బుద్ధి మనిషికో రుచి .

పూజా పునస్కారాలు మాట దేవుడెరుగు.టీ చుక్క దిగనిదే మంచం దిగడు మానవుడు.ఏ ముహూర్తంలో చైనాలో పుట్టిందో గాని.జగత్తంతా జాడ్యం లా పట్టుకుందీ బంగారం.

 పొడి తో పాలు పంచదార కలిపితే పంచామృతం.కాస్తంత అల్లం జోడిస్తే అజీర్ణం బహుదూరం.ఆయుర్వేదమే మెచ్చింది అల్లం టీ.
కాశ్మీరీయులు మెచ్చింది KAVHA TEA.ఇంకెవరు చెప్తారు గూగుల్ తల్లి చెప్పింది ఈ మాట. గ్రీన్ టీ గుండెకు చేస్తుంది మేలు.

అతిధులని సాదరంగా ఆహ్వానిస్తుంది టీ కప్పుతో ప్రతి ఇల్లాలు.ఆరోగ్యానికి కాఫీ వద్దు టీ యే ముద్దు అంటారు డాక్టర్లు.
కెఫిన్ తోటి మత్తు విటమిన్ తో శరీరానికి మహత్తు. బ్లాక్ టీతో ఫ్లూ జ్వరం బహుదూరం.నాలుగు రుచులు కోరుకునే నాలుకకి.
మసాలా టీ అంటే మురిపం.అందుకే టీ అంటే మనకు ప్రకృతి ఇచ్చిన వరం.

 లక్షలు ఖర్చు పెట్టక్కర్లేదు పట్టుమని పది రూపాయలకు దొరుకుతుంది ఈ అమృతం.ముప్పొద్దులా దీంతో నడుస్తుంది మానవ జీవితం.

విద్యార్థికి పరీక్షల కాలం అంటే భయం.నిద్ర దూరంచేసి మెట్టు ఎక్కిస్తుంది ఈ పానీయం.

  పూటకో పూటకో టీ కప్పు లాగించేసి పరిస్థితితో సర్డు కుంటాడు ఓ శ్రమజీవి.

మంచం దిగలేని ముత్తవ్వ కూడా మురిపెంగా చూస్తుంది ఈ తేనీరుని.
కావలసినప్పుడల్లా ఉద్యోగి కాళ్ల దగ్గరికి వస్తుంది..ఆటవిడుపు కోసం HUBki చేరుతారు ఉద్యోగి బృందం.

బాటసారికి అలుపు సొలుపు తీరుస్తుంది. దారిపక్కనే ఉన్న టీ దుకాణం.

  మాడ్యులర్ కిచెన్స్ అక్కర్లేదు. మందీ మార్బలం అసలే వద్దు.
. బడ్డీకొట్టు లో కూడా తయారు చేయవచ్చు ఈ బంగారం .

   అడుగడుగునా వెలిశాయి టీ హబ్ లు. పదిమంది కల్పిస్తున్నన్నాయి ఉపాధి. తేయాకు తో ఎగుమతి దిగుమతి వ్యాపారం.తెస్తున్నాయి కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం.

ప్రతి సంవత్సరం మే 21న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ టీ దినోత్సవం జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి 2019లో అధికారికంగా ప్రకటించింది.

ఈ దినోత్సవ ఉద్దేశ్యం:

టీ పానీయానికి ఉన్న సాంస్కృతిక, ఆర్థిక ప్రాముఖ్యతను గుర్తుచేయడం

టీ సాగు మీద ఆధారపడే రైతులు, కార్మికుల జీవనోపాధిని మెరుగుపరచడానికి అవగాహన పెంచడం

సమాన వాణిజ్య విధానాలు, న్యాయమైన ధరలు, మరియు సుస్థిర వ్యవసాయ పద్ధతుల అవశ్యకతను తెలియజేయడం

టీ గురించి ఆసక్తికరమైన విషయాలు:

టీ అనేది నీటి తరువాత ప్రపంచంలో అత్యధికంగా సేవించబడే పానీయం

టీ పుట్టినిల్లు చైనా. అక్కడ నుండే ప్రపంచానికి వ్యాపించింది

భారత్, చైనా, శ్రీలంక, కెన్యా, జపాన్ వంటి దేశాలు టీ ఉత్పత్తిలో ప్రాముఖ్యం కలిగి ఉన్నాయి

తెలుగు ప్రజల జీవనంలో టీ:

తెలుగువాళ్ల ఇంట్లో ఉదయం టీ లేకుండా మొదలయ్యే రోజు దాదాపుగా ఉండదు

టీ మద్దతుగా చిన్నతరహా హోటల్స్, టపాసీ స్టాళ్లు, పాలు–టీ కేంద్రాలు పని చేస్తున్నాయి

మిత్రులు కలిసే చోట టీ ఒక మాధ్యమంగా పనిచేస్తుంది

ఈ రోజున మనం టీ రైతుల కష్టాన్ని గుర్తించి, సుస్థిరమైన వ్యవసాయ పద్ధతులకు మద్దతుగా ఉండాలి. టీని ఆదరిస్తూనే, ఆరోగ్యాన్ని కాపాడుకునే మార్గాలను అన్వేషించాలి.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.
         కాకినాడ
9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట