మైదానంలో మహోత్సాహం
ఆటగాళ్లు మైదానంలో
స్వైర విహారమాడగా,
బంతి గగనమందు
పక్షిలా విహరించె.
సిక్సుల సుడిగాలి
మైదానమున వీచగా,
ప్రేక్షక హృదయములో
హర్షధ్వని పొంగె.
ఫోర్ల మెరుపులు
కళ్ల ముందర మెరవగా,
పరుగుల ప్రవాహము
స్కోరుబోర్డును నింపె.
బౌలర్ల బాణములు
వికెట్లు నేలకొరిగె,
ప్రత్యర్థి ఆశలు
మెల్లగా కరిగె.
చివరికి ఆ రేయి
జయధ్వని మార్మోగె,
భారత జట్టు కీర్తి
గగనమున ఎగిసె.
— రచన
మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ
9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి