కవల పిల్లల తల్లి
బిడ్డకు జన్మనివ్వడం ఒక వరం.
కవలలు పుట్టడం ఆ వంశం చేసుకున్న పుణ్యం.
పురాణాల కాలం నుంచి ఉంది కవలల జననం
లవకుశల జన్మ అందుకు సాక్ష్యం.
జన్మరీత్యా కవలలు కాకపోయినా
అనుబంధంతో అన్న వెంటే ఉన్నాడు లక్ష్మణుడు
తరతరాలుగా వీరి నామమే కవల పిల్లలు అందరికీ.
రామాయణంలో సీతాదేవి ఊర్మిళ పాత్ర
త్యాగ మయం.
సీతాదేవి అరణ్యం పాలైతే ఊర్మిళాదేవినీ
నిద్రా దేవత పరం
కవల పిల్లలు కాకపోయినా భువిలో
సీతా ఊర్మిళ నామము కవల పిల్లలు అందరికీ
ఆది వైద్యులు అశ్వనీ దేవతలు కూడా కవలపిల్లలు.
వీరి అంశతో జన్మించిన వారే నకుల సహదేవులు.
ఒకే కాన్పు లిప్తపాటు తేడా
ఒకరి తర్వాత ఒకరు
ఒకే పోలిక ఎవరు పెద్ద
ఎవరు చిన్న ఎవరు ముందు
ఎవరు వెనుక పుట్టించిన
బ్రహ్మకే అయోమయం.
మత్తులో ఉన్న అమ్మ మాత్రం ఏమి చెప్పగలదు.
బ్రహ్మకి అమ్మకి తెలియని సత్యం.
అందుకే కవల పిల్లలు అంటే అందరికీ అభిమానం.
ఏ ప్రాణి జన్మకైనా అమ్మే కదా ఆధారం.
బిడ్డను లాలించి పోషించేది అమ్మ.
కవల బిడ్డ అయినా ఒకే బిడ్డ అయినా
యధావిధిగా తన ధర్మం నిర్వహించేది అమ్మ.
బాధ్యత లోనే కదా తేడా.
బాధ్యత అమ్మ సహనాన్ని రెట్టింపు చేస్తుంది.
పెదవి విప్పి చెప్పదు ఏ కష్టం.
కవల పిల్లల పెంపకం కత్తి మీద సాము కదా.
ఒక బిడ్డ ఏడిస్తే రెండో బిడ్డ కూడా రాగం తీస్తుంది.
ఇద్దరికీ ఒకేసారి పంచాలి స్తన్యం.
ఎవరిని ముందు సముదాయించాలో తెలియని అయోమయం.
ఒక బిడ్డ నవ్వితే రెండో బిడ్డ కూడా కేరింత
ఇద్దరి ఆట పాటలు ఒకేసారి ఆనందించడం
మనసు నేర్చుకో లేని పాఠం.
అభిరుచుల మాటెలా ఉన్నా
రుచులు తీర్చడం కన్నతల్లికే కదా కష్టం
అందుకే అంటాను ఒకరు అమ్మ బిడ్డ ఒకరు నాన్న బిడ్డ
కాదు కాదు బిడ్డలందరూ అమ్మానాన్నల ప్రతిరూపం
బిడ్డల కాలకృత్యాల తోనే సరిపోతుంది ఆమెకు నిత్య కృత్యం.
తనకి ముద్ద తినడానికి సమయం ఉందో లేదో తెలియదు
కన్న బిడ్డల ముద్దు ముచ్చట తోటే ఆ సమయం అంతా.
కట్టుకున్నోడు మనసున్న మారాజు అయితే
బాధ్యతలు బరువులు పంపకం.
లేకపోతే ఆ తల్లి బ్రతుకంతా నిత్యం రణం.
బాలారిష్టాలు అన్నిటినీ బరువుగా నెట్టుకొస్తుంది
ఆ బంగారు తల్లి.
బరువైన బాధ్యతగా ముందుకు నెట్టుకువస్తుంది.
బిడ్డకు బ్రతుకుతెరువు చూపించి బాధ్యతగల బంధంతో
ముడి వేస్తుంది ఆ మమతల తల్లి.
ఏదైనా తల్లికే కదా .
అందుకే తీర్చుకోలేం మాతృ ఋణo.
కన్న బిడ్డలు కవల బిడ్డ అయితేనేం.
పెద్ద తేడా ఏమి లేదు ఆ సహన మూర్తికి
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.
కాకినాడ
9491792279
.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి