శివుడు

 అంతులేని దృష్టి కలవాడు పరమేశ్వరుడు.

అడిగిన వెంటనే వరాలిచ్చే భోళా శంకరుడు.

అజ్ఞానం తొలగించి జ్ఞాన మిచ్చే దక్షిణామూర్తి .

ఈ నాట్యకళ అంతా నటరాజ ప్రసాదమే 

ఏమని వర్ణించను ఆతని వైభవం.


 దుష్ట శిక్షణకే అవతరించాడు మహాకాలుడిగా.

మన భయాలను తొలగించి భైరవుడు అయ్యాడు

    జరామరణములు లేని జగదీశుడు శివుడు.

    ఏమని వర్ణించను ఆతని వైభవం.


     వెండి కొండపై ఉంటాడు

ప్రార్థనతో మంచులా కరిగి పోతాడు

 మన బాధలు అన్నీ మంచులా కరిగిస్తాడు

కోరిన వెంటనే అన్ని కోరికలు తీర్చే ఆశుతోషుడు.


అంతులేని గుణములు ఉన్నవాడు ఆదినాథుడు

వంక పెట్టలేని గుణములు ఉన్నవాడు పరమాత్ముడు.

పంచభూతాలన్నీ అతడి ఆధీనమే .

ఏమని వర్ణించను ఆతని వైభవం.


బాధలను తొలగించి శాంతిని ప్రసాదించే కైలాస నాధుడు.

లోకాలను రక్షించువాడు జగత్తును సృష్టించే వాడు శివుడు.

శాశ్వతమైన స్వామి సర్వ శివుడు. 

సర్వమునకు అధిపతి సర్వేశ్వరుడు.

ఏమని వర్ణించను ఆతని వైభవం 


     నాగులన్ని ఆతడి ఆభరణం.

ఆతని భక్తులైన మాకు నాగన్న అంటే ఎందుకు భయం.

మన వంశాభివృద్ధికి నాగులే చేయు దోహదం.

ఏమని వర్ణించను ఆతని వైభవం.


వాక్కునకు అధిపతి శివుడు.

 వరాలు ఇచ్చేవాడు శివుడు.

వేదములను సృష్టించిన వేదకర్త.

సుఖములను ఇచ్చువాడు శివుడు.


శివo అంటే శుభప్రదం.

లింగము అంటే సంకేతము.

శివలింగము అంటే శుభానికి సంకేతం.

లింగోద్భవ సమయమే శివరాత్రికి పుణ్యకాలం.


శివరాత్రి జాగరణ భక్తకోటికి ముక్తి ఫలం.

 పరమేశ్వర కళ్యాణమే జగత్ కళ్యాణం.

భక్తజనకోటి కదే నయనానందకరం.

 పరమేశ్వరుడే ఇచ్చు సకల సుఖం.


రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.

           కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట