అరుగు


అరుగు ఇంటికి అందం, యజమానికి ఆనందం,

యజమాని కంటే ముందే అతిథి గౌరవం.

ఇంటి గౌరవం కాపాడే మౌన బంధం,

అడుగుపెట్టగానే మనసు నిండే అనుబంధం.


రాజు కూర్చుంటే అది సింహాసనం,

పసిబిడ్డకు అది ఆటస్థలం.

పండు ముదుసలికి విశ్రాంతి మందిరం,

ఉబుసుపోక కూర్చుంటే బోలెడు కాలక్షేపం.


రామాయణం, లోకాభిరామాయణం

తరతరాలుగా వింటూనే ఉంది;

నవ్వుల ప్రతిధ్వనులు, కన్నీటి చరిత్రలు

నిశ్శబ్దంగా తనలో దాచుకుంది.


గడిచిన కాలానికి గడియారం కాదు అది—

జ్ఞాపకాలను కాపాడే నిలువెత్తు గ్రంథం.

వచ్చినవారిని ఆహ్వానించి, వెళ్లినవారు గుర్తుంచుకునే 

మనసులను మోసే మట్టి పలక

.

కాలం మారినా కదలని సాక్ష్యం,

మనుషులు మారినా తగ్గని ఆత్మీయత.

అడుగుల రాకపోకలే దీని శ్వాస అయితే,

అరుగు అంటే… ఇంటి ముందు నిలిచిన జీవితం.


రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు 

కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

సామర్లకోట

కుటుంబం