బాలు

బాలు

ప్రతి పాటకు అర్థం
 ఆ పాట సందర్భం మీద వ్యాఖ్యానం.
 ఆ రాగంలో చేసిన పాటలు.
 ఆ స్వర బ్రహ్మలకు జేజేలు
పాటల బ్రహ్మకు ప్రణామాలు.

గళమెత్తి పాడే చిన్నారులకు
అపురూపమైన సూచనలు
అనంతమైన ఆశీర్వచనాలు

పదుగురు మెచ్చిన ప్రోత్సాహకాలు
వెరసి పాడుతా తీయగా కార్యక్రమం.

రథసారథి బాలసుబ్రమణ్యం.
ఇంటి పేరు లోనే ఉంది పండిత శబ్దo.
ముద్దు పేరు బాలు. 
ముద్దుముద్దుగా మాటలు పలుకు.

భాష అంటే అభిమానం
సాహిత్యం అంటే మక్కువ

పాట అర్థం చేసుకుని ఆలపించడం
అదే ఆయన ప్రగతికి సోపానం.

కోదండపాణి గారి ప్రోత్సాహంతో సినీ రంగ ప్రవేశం.
ఒకటారెండా 40 వేల పాటలు.
ఏ భాషలో అయినా ఆయన గొంతు వీరంగం.

అవార్డులన్నీ ఆయన మెడలో హారం.
నందులన్ని బాలు గారి ఇంట్లో నివాసం

శత స్కోప్ లేని డాక్టర్ బాలు
బయోస్కోప్ తెచ్చింది డాక్టరేట్.

పద్మశ్రీ, పద్మభూషణ్ తో సత్కారం
మరణానంతరం పద్మ విభూషణతో అలంకారం.

పాటలతోనే కాదు మాటలతో కూడా 
మురిపించింది ఆయన గొంతు.
చక్రవర్తి గారు ఇచ్చిన ప్రోత్సాహంతో 
డబ్బింగ్ కళాకారుడు గా అవతారం.

ఆయన ప్రతిభకు దశావతారం సినిమా 
ఒక మచ్చుతునక.

మిధునం సినిమాలో అప్పదాసు పాత్ర
నటనా కౌశల్యానికి మచ్చుతునక.
ఒకసారి కాదు పది సార్లు చూడాలనిపించే సినిమా.

పలు చిత్రాలకు అద్భుతమైన బాణీలు
మయూరి ,తూర్పు వెళ్ళే రైలు, పడమటి సంధ్యారాగం
సినిమాలే అందుకు నిదర్శనాలు

వేలకొలది భక్తిగీతాల ప్రైవేట్ ఆల్బమ్ లు.
ఏ గుడి తలుపు తెరిచిన ఆయన గొంతుతోటే సుప్రభాతం.
 ఆయన లేనిదే ఏ నాడూ జరగలేదు ఈ టీవీ స్వరాభిషేకం.

కాలానికే కన్నుకుట్టింది ఆయన ప్రతిభ.
కరోనాతో ముగిసింది ఆయన కాలం.
కళామతల్లి స్వరాల బిడ్డ చేరింది గంధర్వలోకం.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.
        కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట