ఆరోగ్యం వెర్సెస్ ఆహారపు అలవాట్లు. ప్రతి జీవికి నిత్యవసరాలలో ముఖ్యమైనది ఆహారం. బ్రతుకు బండి సాగాలంటే శక్తి కావాలి. మనిషికి శక్తి తినే ఆహారo నుంచి పుడుతుంది. మనిషి శరీరము ఒక నడిచే కారు లాంటిది. కారు నడవాలంటే పెట్రోల్ పోయాలి. అలాగే మనిషి శరీరానికి కూడా సమతుల ఆహారం అందించాలి. విటమిన్లు పిండి పదార్థాలు ఖనిజ లవణాలు పీచు పదార్థాలు శరీరానికి కావలసిన రక్షణను శక్తిని ఇస్తాయి. శాఖాహారులందరూ బియ్యం ఆకులు పండ్లు కాయలు గింజలు ఆహారంగా స్వీకరిస్తారు. మాంసాహారులు వీటితో పాటు జంతువుల మాంసం ఆహారంగా తీసుకుంటారు. అయితే తీసుకునే ఆహారాన్ని పరిమితంగా తినడం, పరిశుభ్ర వాతావరణంలో వండిన పదార్థం తినడo,వేళకు తినడం లాంటి కొన్ని నియమాలు ఉన్నాయి. వీటిలో ఏ నియమం తప్పిన ఆహారం విషతుల్యమవుతుంది. అది మన శరీరానికి మంచి బదులు చెడు చేస్తుంది. పూర్వకాలంలో తొలి రోజున వండిన ఆహార పదార్థాలను ముట్టుకునేవారు కాదు . అది మడి కాదు ఆచారంకాదు. ఆరోగ్యం కోసం తీసుకున్న జాగ్రత్త.ఆధునిక కాలంలో ప్రతి ఇంట్లో ఉండే రిఫ్రిజిరేటర్లులలో వండిన ఆహార పదార్థాలు దాచుకుని రెండు మూడు రోజుల వరకు ఉంచుకుని తింటున్నారు. ఇది ఆరోగ్యానికి ఎంతవరక...
కోట లేకపోయినా మాది సామర్లకోటే. ఆదిలో అది శ్యామలాదేవి కోట. శ్యామలాoబ గుడి లేని మా కోట సామర్ల కోట. ఊరే పంచారామం,చాళుక్య భీమేశ్వర ఆలయం. భక్తకోటికి అదే యాత్రావిహారం. కార్తీకమాసం జనసందోహం. కరోనా కాలమంతా నిశ్శబ్దం. పవిత్రతకు ప్రశాంతతకు మాండవ్య నారాయణ ఆలయం. ఆదిలోనే శంకరుల కొలువు మధ్యలోని అమ్మ నూకాలమ్మ. పక్కనే సాయి మకాం అంత్యం అంతా ప్రసన్నాంజనేయం. అదే మా గ్రామం భీమారామo ఆది, అంతం అంతా భగవదత్తం. తరాలతో పాటు ఆధునికంగా మారిన రైల్వే జంక్షన్. హౌరా చెన్నై మార్గం లో ప్రధాన జంక్షన్. రైలు ఎదురుగా బస్సుల స్టాపు. ప్రధాన నగరాలు అన్నిటికీ బస్సు సౌకర్యం. మా కోట వాసులందరికి గమ్యం గగనం కాదు. తరతరాలుగా యువతకు ఉపాధి ఇస్తున్న ఆయిల్ పరిశ్రమలు . అంబటి సుబ్బన్న అండ్ కో పప్ప...
కుటుంబం ఉదయం ఆరు గంటలు అయింది. ఆ వృద్ధుల ఆలయంలో మైకు నుంచి విష్ణు సహస్రనామం శ్రావ్యంగా వినపడుతోంది. ఒంటిమీద తెల్లటి బట్టలు వేసుకుని కాళ్లకు నల్లటి షూ తొడుక్కుని నుదుటన ఎర్రటి బొట్టు పెట్టుకుని సగం సగం నెరిసిన జుట్టుతోసుమారు యాభై ఏళ్ళ వయసు ఉన్న ఒక వ్యక్తి ప్రతి గది లోకి తొంగిచూస్తూ అక్కడున్న వృద్ధులను ఆప్యాయంగా వరుసలు కలిపి పలకరిస్తున్నాడు. "పెద్దమ్మ కాఫీ తాగావా! పెద్దనాన్న లేచావా! ఆరోగ్యం బాగుందా! మందులు వేసుకున్నావా! రాత్రి నిద్ర పట్టిందా! ఇలాంటి ప్రశ్నలతో ఆ వృద్ధులందరినీ పలకరించడం ఆయన దినచర్య. ఆ వృద్ధుల ఆలయంలో సుమారు యాభై గదులు ఉంటాయి. ప్రతిరోజు ప్రతి గదిని నిశితంగా పరిశీలించి బాగోగులు కనుక్కోవడం ఆయనకి ఇష్టం. తనకంటూ ఎవరు అయినవాళ్లు లేకపోయినా , అయినవాళ్లు ఉండి కొందరు, ఎవరూ లేకుండా ఆ వృద్ధుల ఆలయంలో చేరిన ప్రతి ఒక్కరిని తన బంధువు లాగే చూసుకుంటాడు . మర్యాదలు చేస్తాడు. కష్టం వస్తే తల్లడిల్లిపోతాడు. ఎవరికైనా అనారోగ్యం వస్తే రాత్రి పగలు తేడా లేకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. అలా ప్రతి గదిలోకి తిరిగి భోజనాశాలలోకి వెళ్లి అందరూ పలహారం తీసుకునే వరకు అక్కడే కూర్చ...
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి