మాయ
భువనమంత నోటిలో చూపించే బాలకృష్ణుడు
బిడ్డగా ఒడిలో చేరితే ముద్దు మురిపం చేయకుండా
తరిమి తరిమి కొట్టే తల్లికి తెలియలేదు విష్ణుమాయ.
తల్లి రూపంలో వచ్చిన రక్కసి పూతన రక్తం పీల్చి
హతమార్చిన బాలకృష్ణుడి మాయ .
అల్లరి ఆగడాలు భరించలేక రోలుకి బందీ చేయబడిన
లోకేశ్వరుడు గంధర్వులను బంధ విముక్తులను చేసిన
అల్లరి కృష్ణుడు మాయ.
కాళింది మడుగులో కాళీయుడు పై నృత్యం చేసిన తాండవ కృష్ణుడు మాయ.
వేణు గానముతో మంత్రముగ్ధులను చేసిన వేణుగోపాలుడి మాయ.
చిటికెన వేలితో గిరిని ఎత్తి ప్రళయకాలంలో
రేపల్లె వాసులను కాపాడిన గిరిధరుడి మాయ.
గురుపుత్రుని బతికించి గురుదక్షిణగా సమర్పించిన
శిష్యుడు మాయ.
వస్త్రాపహరణ సమయంలో ఎలుగెత్తి పిలిచిన ద్రౌపదిని
అవసరమైనది ఇచ్చి కాపాడిన కృష్ణ మాయ.
ఉపనిషత్తుల సారాంశం గీతగా బోధించి అర్జునుడిని యుద్ధోన్ముఖుని చేసిన గీతా కృష్ణుడి మాయ.
దేవాది దేవుడి తల్లి కే సాధ్యం కాలేదు
విష్ణు మాయ ని తెలుసుకోవడం.
అజ్ఞానాంధకారంలో ఉన్న మానవులకు ఎలా తెలుస్తుంది భగవంతుడి మాయ.
జరిగిన ప్రతి సంఘటన కనపడని భగవంతుడు మాయ.
మౌనంగా కర్మసిద్ధాంతాన్ని నమ్మడమే మానవుల కర్తవ్యం.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.
కాకినాడ
9491792279
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి