జీవితం

నీటి బుడగ జీవితం. ఎప్పుడు చితికి పోతుందో ఎవరికి తెలుసు. చావు బతుకుల మధ్య కాలంమే జీవితం. పగలు రాత్రి ప్రతిమనిషికీ సమానం. సగ భాగం అంతా తిండి నిద్రకి సరిపోతుంది. బాల్యమంతా నీ జీవితం గురించి నీకు అవగాహన ఉండదు. యవ్వనం నుండి నీ అసలు జీవితం ప్రారంభం అవుతుంది. ఇంకో జీవి కూడా నీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఆ జీవి కూడా జీవితం అంటే అంత వరకు తెలియదు. అమ్మా,నాన్న ,పుస్తకాలు ,కాలేజీ, హాస్టల్ జీవితం బాధ్యతలు లేని బతుకు ఇంతవరకు అనుభవించిన తీపి గుర్తులు. ఇంకొకరి తో జీవితం ఒక ఫ్రేమ్ లో ఉంటుంది. 

ఒకరి బాధ్యతలు ఒకరు పంచుకోవడం. ఒకరి కోసం ఒకరు బతకడం. తన ఇష్టాలను త్యాగం చేయడం కూడా తప్పదు. సర్దుబాటే జీవితం.

సరే జీవితంలోకి అడుగు పెట్టాం. జీవిత సాఫల్యo ఏమిటి. డబ్బు పిల్లలు వృద్ధాప్యం ఈ మూడింటి తోటి మనకు చిక్కులు వస్తాయి.

మన ఆనందంగా జీవించడానికి డబ్బు కావాలి. 
డబ్బు చుట్టూ ప్రపంచం తిరుగుతుంది. చేసిన పనికి ప్రతిఫలమే జీతం. జీతం తో జీవితం ఆనందంగా గడపడమే . అప్పనంగా వచ్చేది లంచం. లంచం పంచ రంగుల జీవితం చూపిస్తుంది. కానీ దైవం ఎప్పుడూ మనం గమనిస్తూనే ఉంటుంది. పరుల సొమ్ము ఆశించక పోవడమే పరమార్ధం.

గౌతమ్ బుద్ధుడు చెప్పినట్లుగా జీవితమంటే ధర్మం కోసం పోరాడడం. ధర్మబద్ధంగా జీవించడమే జీవిత లక్ష్యం.
మొగుడు డబ్బు ఎక్కడి నుంచి తీసుకు వస్తున్నాడో తెలుసుకోవడం భార్య ప్రథమ కర్తవ్యం. భార్య పాత్ర ఆడిటర్ లాంటిది. సంసారపు లెక్కలన్నీ చూడాలి.
అప్పుడే భర్త గాడి తప్పడు. లంచం అనే పదం డిక్షనరీలోనే ఉండదు. పొదుపుగా డబ్బులు వాడుకుంటే ఏ గొడవ ఉండదు.

జీవితంలో అతి ముఖ్యమైనది పొదుపు. పొదుపు అంటే పిసినారి తనం కాదు. డబ్బులు దుర్వినియోగం చేయకపోవడమే పొదుపు. అవసరానికి అక్కరకికొచ్చేది. పొదుపు. అప్పుచేసి బంగ్లాలు కట్టడం కన్నా అద్దె ఇంట్లో బతకడం కూడా మేలే. ఆస్తుల విలువ పెరిగే ధరలతో పాటు మనం లెక్కలు చూసుకుni తృప్తి పడిన అప్పుకి కట్టే వడ్డీ అంత కంటే ఎక్కువ ఉంటుంది. ఏదైనా ఉన్నదానితో తృప్తి గా జీవించడం అన్నిటికన్నా ముఖ్యం .కార్డుల వాడకం తగ్గాలి. మితము తప్పితే అమృతమైనా విషమే.

మన జీవితానికి తీపి గుర్తులు పిల్లలు. పిల్లలే జీవితం. జీవితమే పిల్లలు. భగవంతుడిచ్చిన ఆడయినా మగయినా పిల్లలే. ఎవరినీ తక్కువ చూడకూడదు. అందరికి సమానమైన తెలివితేటలు ఉండవు. పిల్లల్లో పిల్లలుగా కలిసిపోతూ వారి బాగోగులు చూసుకుంటూ వారిని గట్టెక్కించిడ మే జీవిత పరమార్థం. ప్రేమాభిమానాలు పంచుతూ ఉండాలి. మొదటినుంచి వారితో పంచుకున్న ప్రేమ మన వృద్ధాప్యంలో మన పై వారి అభిమానంగా మారుతుంది. అదే మన జీవిత సాఫల్యం. ప్రపంచ పోకడలతో మన పిల్లల్ని పోల్చుకోరాదు. మనకు ఉన్నది పిల్లలకి క్లియార్ గా తెలియ చెప్పాలి.

జీవితంలో మరో ముఖ్యమైన దశ వృద్దాప్యం. ఈ దశ అదృష్టాన్ని బట్టి ఉంటుంది. పిల్లల దగ్గర తీసుకుంటూ వారితో కలిసి మెలిసి ఉంటూ ఆనందాలను పంచుకుంటూ
జీవితాన్ని గడపడమే వృద్ధాప్య లక్ష్యం. పిల్లలను దూరం చేసుకోకూడదు. కడుపున పుట్టిన పిల్లలు శత్రువులుగా చూస్తే ఇంతకంటే నరకం ఏమీ ఉండదు. పిల్లల నుండి ఆర్థికంగా ఏమీ ఆశించకూడదు. మనమే పది రూపాయల పిల్లలకు ఇచ్చేలా ఉండాలి. ఈర్ష్యాద్వేషాలుకు దూరంగా ఉండాలి. అనవసర విషయాల గురించి ఆలోచిస్తూ పట్టించుకోకుండా జీవితం గడపడమే ప్రధానలక్ష్యం.

కొందరు వ్యక్తులు అనుభవాల నుంచి చూసిన విషయాలు ఈ వ్యాసం. వారి అనుభవాలు మనకు పాఠాలు. వయసుతో నిమిత్తం లేదు ప్రతిసారీనేర్చుకుంటూనే ఉండాలి. మనిషి వయసు పెరిగిన పండితుడు కాలేడు.
పరిపూర్ణుడు కాలేడు. అనుభవాలే గట్టిగా చేస్తాయి. కరోనా వచ్చే వరకు karono లాంటి జబ్బు ఉందని మనకు తెలియదు. అది వచ్చిన తర్వాతే ముఖానికి మాస్కులు శానిటైజర్ లు వాడకం తెలిసాయి. అదే మన అనుభవం. వయసు కన్నా అనుభవం ముఖ్యం. అనుభవం తోటే ఆత్మనిగ్రహం వస్తుంది. అనుభవం తో చేసిన అమ్మమ్మ చేతి వంట ఎంత రుచిగా ఉంటుంది.
వృద్ధాప్యంలో అనుభవాలన్నీటిని పోగు చేసుకుని గుంభనంగా ఉండాలి. నిగ్రహంగా ఉండాలి. అప్పుడే జీవితం పరిపూర్ణం. 

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.
          కాకినాడ
     9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆరోగ్యం వర్సెస్ ఆహారపు అలవాట్లు

సామర్లకోట

కుటుంబం