జీవితం

జీవితం 

సాయంకాలం ఐదు గంటలు అయింది. ఆ పల్లెటూర్లో ఉండే సోమయాజులు గారి ఇల్లంతా హడావిడిగా ఉంది. నడవలో
వేసిన కుర్చీల్లో సోమయాజులు గారు కుటుంబం ఒకవైపు
పెళ్ళికొడుకు రమేష్ కుటుంబం ఒకవైపు కూర్చుని మాట్లాడుకుంటున్నా రు. అమ్మాయికి అబ్బాయికి 
అబ్బాయికి అమ్మాయి నచ్చారు. కట్న కానుకలు వద్దని ముందుగానే చెప్పారు మగ పెళ్లి వారు.ఇంక పెళ్లికి సంబంధించిన విషయాలు మాట్లాడుకోవడమే తరువాయి.

సోమయాజులు గారు తూర్పుగోదావరి జిల్లాలో కాజులూరు మండలంలో ని పల్లిపాలెం స్కూలు హెడ్మాస్టర్ గా పనిచేస్తున్నారు. ఆయనకు ఒకర్తే అమ్మాయి. అమ్మాయి పేరు వైదేహి . అచ్చు తెలుగు వారి పిల్లలా ఉంటుంది. డిగ్రీ చేసిన తర్వాత బీఈడీ కంప్లీట్ చేసి టీచర్ గా అక్కడ దగ్గరగా ఉన్న స్కూల్లోనే పనిచేస్తోంది. సోమయాజులు గారికి ఇంకా 5 సంవత్సరాలు సర్వీసు ఉంది. ఈలోగా పిల్లకు పెళ్లి చేస్తే రిటైర్మెంట్ అయిన తర్వాత బాధ్యతలు ఉండవని ఆయన ఆలోచన.
అయితే పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు ఈడు జోడు చూడాలంటారు. అందుకే టీచర్ ఉద్యోగం చేసే వరుడు కోసం వెతుకుతూ చివరికి కాకినాడలో టీచరుగా పనిచేస్తున్న రమేష్ తో పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. చివరికి పిల్లలిద్దరికీ ఒకరికి ఒకరు నచ్చారు. 
హాల్లో కూర్చున్న వాళ్ళంతా పిచ్చపాటి మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో వైదేహి కూల్ డ్రింకు గ్లాసులతో హాల్లోకి వచ్చింది. హాల్లో ఉన్న వాళ్ళందరికీ తలో గ్లాసు ఇచ్చి తను కూడా ఒక గ్లాస్ తీసుకొని మూలగా ఉన్న కుర్చీలో కూర్చుంది. అందరూ కూల్ డ్రింక్. తాగడం అయిపోయిన తర్వాత చూడండి అందరితో ఒక విషయం గురించి మాట్లాడా లి అంటూ మగ పెళ్ళివారి వైపు చూసి చెప్పడం ప్రారంభించింది. 

 సోమయాజులు గారు కూడా ఆసక్తిగా కూతురు వైపు చూస్తున్నారు నేను మా నాన్నగారికి ఒకర్తే కూతురిని. రేపు ముసలి వయసులో మా తల్లిదండ్రులను చూసుకోవడానికి వేరే ఎవరూ లేరు. కాబట్టి మా తల్లిదండ్రులు నా దగ్గరే ఉంటారు. చాలామందికి ఇది ఇష్టం ఉండదు. మీ అభిప్రాయం చెప్పడంలో ఈ విషయాన్ని కూడా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఆలోచించుకొని చెప్పండి . కంగారు ఏమీ లేదు. ఈ విషయం చెప్పడానికి మా నాన్నగారు మొహమాటపడుతున్నారు ఆ కాలం వారు కాబట్టి అంటూ తన మనసులో ఉన్న మాట చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తాo ఉంటూ అందరి దగ్గర సెలవు తీసుకుని మగ పెళ్లి వారు వెళ్ళిపోయారు. 

తర్వాత వారం రోజులకి రమేష్ తండ్రి రఘురామయ్యగారు ముహూర్తాలు పెట్టించమని ఫోన్ చేశారు.కానీ సోమయాజులు గారి దంపతుల బాధ్యత గురించి ఒక మాట మాట్లాడ లేదు.
 ఇష్టం ఉందో లేదో తెలియదు. 
అలా అని మంచి సంబంధం వదులుకోవడం ఎలా అనుకుంటూ సోమయాజులు గారు ఆలోచనలో పడి అప్పుడు చూద్దాంలే అనుకుంటూ ముందుకు సాగిపో యారు.

 రమేష్ రఘురామయ్యగారి నలుగురు కొడుకులలో పెద్దవాడు.
 అందరికంటే పెద్ద వాళ్ల యిన ఆడపిల్లలకి పెళ్లిళ్లుఅయి పోయాయి. మిగిలిన మగ పిల్లలంతా చదువుల్లో ఉన్నారు. రమేష్ తాతగారు మామ్మగారు కూడా రఘు రామయ్య గారి దగ్గరే ఉంటారు.ఒక శుభ ముహూర్తంలో పెద్ద కోడలుగా అడుగుపెట్టింది ఆ ఇంట్లో వైదేహి. అందరిదీ ఉమ్మడి కుటుంబం. చాలా పెద్ద సంసారం. కాకినాడలో ఉన్న రెండంతస్తుల సొంత ఇంట్లో క్రింద వాటాలో రఘురామయ్యగారు కాపురం ఉంటూ పైవాట అద్దెకిచ్చారు. వాళ్లకి దగ్గరున్న పల్లెటూర్లో పొలాలు ఉన్నాయి. ఎవరో ఒకరు రైతులు వచ్చి పోతుంటారు. ఇల్లంతా ఎప్పుడు హడావిడిగా ఉంటుంది.

వైదేహికి కూడా కాకినాడ గాంధీనగర్ స్కూలుకి ట్రాన్స్ఫర్ చేయించుకుంది.ఉన్న ఊర్లోనే ఉద్యోగం అబ్బా ఎంత హాయి అనుకుంటున్న వైదేహి కి ఇంట్లో పరిస్థితి తారు మారయింది. వైదేహి అడుగుపెట్టగానే అత్తగారికి మోకాళ్లు నొప్పులు వచ్చి హాస్పిటల్ తిరగడం ప్రారంభించారు. పాపం వైదేహి ఇంత మందికి రోజు పొద్దున్న వండిపెట్టి క్యారేజీ పట్టుకుని స్కూల్ కి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చి మళ్ళీ వంట పని ఇంటి పని. క్షణం తీరికలేదు.ఇలా బాధ్యతలతో ఐదు సంవత్సరాలు గడిచి వైదేహి ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది.
ఉదయం లేచిన దగ్గర నుండి పిల్లల బాధ్యతలు కుటుంబ బాధ్యతలు స్కూలు బాధ్యతలు ఎక్కడా ఊపిరి సలపనంత పని. ఇంట్లో ఎంతమంది ఉన్నా వైదేహి మావగారు మాత్రమే ఆడపిల్లలా వైదేహి కి సాయం చేసేవారు. ఇంటికి వచ్చేటప్పటికి ఏవో స్నాక్స్ బజార్ నుండి తీసుకొచ్చి టీ ప్లాస్కో లో రెడీగా పెట్టేవారు .మెటర్నిటీ లీవ్ అయిపోయిన తర్వాత పిల్లల్ని ఎక్కడ ఉంచాలో తెలియలేదు . వైదేహి స్కూల్ కి వెళ్లే ముందు పిల్లల కడుపు నింపి నిద్రపుచ్చేది. ఈ లోగా పాపం పిల్లల్ని నిద్ర లేస్తే రఘురామయ్య గారు సముదాయించి పిల్లలకు పాలు పట్టేవారు.
పిల్లలు క్రమేపికి రఘురామయ్యగారికి అలవాటయ్యారు.

 వైదేహిఅత్తగారితల్లితండ్రులభాధ్యతఅంతారఘురామయ్యగారు తీసుకున్నారు .ఇలా రఘురామయ్యగారు కోడలికి అన్నిచోట్ల చేదోడుగా వాదోడుగా ఉంటూ జీవితం గడుపుతూ వచ్చారు.

సోమయాజులు గారు కూడా పెళ్లయిన తర్వాత వియ్యాలవారిని వదిలేయలేదు. ప్రతిరోజు రఘురామయ్యగారితో మాట్లాడుతూ మంచి చెడ్డలలో పాలుపంచుకునేవాడు. ఉయ్యాల వారితోటి కయ్యాలు కాదు మంచి స్నేహ సంబంధాలు మెరుగుపరచుకోవాలని ఆయన. ఆకాంక్ష. ఏనాడు కూతురి ఇంత కష్టపడుతూ ఉందని ఎవరితోను ఒక మాట మాట్లాడలేదు. ఆడపిల్ల అత్తవారి గురించి ఒక తప్పుడు మాట మాట్లాడలేదు.
ఈలోగా సోమయాజులు గారికి రిటైర్మెంట్ దగ్గర పడింది. వైదేహి గుండెల్లో రాయిపడింది. గంపెడు సంసారం. ఇద్దరు పిల్లల బాధ్యత. మంచాన పడిన అత్తగారు. ఇంకా మరుదులు చిన్నవాళ్లు. దానికి తోడు వైదేహి తల్లిదండ్రులు కూడా వస్తే
 ఇంత మంది బాధ్యత ఆలోచనలలో పడింది వైదేహి. అలా అని కన్న తల్లిదండ్రులు ఎలా వదిలేస్తాo ఇలా ఆలోచనలతో 
ఎప్పటికో కానీ వైదేహి కి నిద్ర పట్టేది కాదు.

ఒకరోజు ఉన్నట్టుండి రఘురామయ్య గారు పైవాటా ఇంటిని ఖాళీ చేయించి రంగులు వేయించారు. సడన్ గా చేస్తున్న ఈ పని ఎందుకో ఎవరికీ అర్థం కాలేదు. ఒకరోజు పిల్లలందరినీ కోడల్ని భార్యని హాల్లోకి పిలిచి చూడండి ఎల్లుండి సోమయాజులు బావగా రి రిటైర్మెంట్ . మనమందరం బావగారు రిటైర్మెంట్ ఫంక్షన్ కి అక్కడికి వెళ్లాలి. అక్కడ రెండు రోజుల ఉండి వచ్చేటప్పుడు సామాన్తో బావ గారిని అక్కయ్య గారిని మన ఊరు తీసుకొచ్చేస్తున్నాం.వాళ్ళు మన ఇంటి పై వాటిలో ఉంటారు. భోజనం మన ఇంటి దగ్గరే చేస్తారు .ఆ పల్లెటూర్లో అన్ని అమ్మేసుకుని ఇక్కడికి వచ్చేస్తున్నారు. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని బాగా చూసుకునే బాధ్యత మనదే. పైగా ఇక్కడ మేము అందరం ముసలి వాళ్లo పిల్లలు మాకు అందరికీ చేదోడు వాదోడుగా ఉండాలి. ఏలోటూ రాకుండా చూసుకోవాలి. 

ఈ నాలుగు రోజులు మా అమ్మని నాన్నగారిని చూసుకోవడానికి మా దూరపు బంధువు ఒకామె రాజమండ్రి నుంచి మన ఇంటికి వస్తుంది. ఆమె భర్త పోయిన తర్వాత వంటలు చేసుకుని బతుకుతోంది. మరొక ముఖ్య విషయం ఏంటంటే ఇంతమందికి వైదేహి వండి వడ్డించడం చాలా కష్టం. అందుకు ఆమెని మన ఇంట్లోనే పెర్మనెంట్ గా వంట చేసి పెట్టడానికి కుదిర్చాను. ఆమె మేడ మీద మనం మూడో బెడ్ రూమ్ లో ఉంటుంది. ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. లేదంటే కోడలు వైదేహికి చాల కష్టం . అంటూ చెప్పుకుంటూ పోతున్నా డు రఘు రామయ్య గారు. రమేష్ తో సహా పిల్లలందరూ చప్పట్లు కొట్టారు. వైదేహికి ఒక క్షణం ఏమీ అర్థం కాలేదు. కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. రెండు చేతులు ఎత్తి ఏమీ మాట్లాడకుండా మావగారికి నమస్కారం చేసింది.

అనుకున్న ప్రకారం రఘురామయ్యగారి కుటుంబం సోమయాజులు గారి రిటైర్మెంట్ ఫంక్షన్ కి వెళ్లి ఫంక్షన్ అయిన మూడో రోజు సోమయాజులు గారిని సామాన్లు తీసుకుని కాకినాడ తీసుకొచ్చి పై వాటలో సామాన్లన్నీ సర్దేసి స్థిమిత పరిచారు.

సోమయాజులు గారు క్రమేపీ నగర వాతావరణానికి అలవాటు పడ్డారు. రోజు ఉదయం వాకింగ్ చేయడానికి బయటకు వెళ్లి వచ్చేటప్పుడు కూరగాయలు పాల ప్యాకెట్లు తీసుకొచ్చి వంట మనిషికి ఇచ్చి పైవాటకు వెళ్లి స్నానం చేసి పూజ చేసుకుని కిందకి వచ్చి టిఫిన్ తినేసి పేపర్ చదువుతూ రఘురామయ్య గారితో చదరంగం ఆడుతూ రఘురామయ్యగారి తల్లిదండ్రులతో భార్యతో మాట్లాడుతూ కాలక్షేపం చేసుకునే వాడు. మళ్లీ భోజనం చేసి కాసేపు పడుకుని టీ తాగి మళ్లీ లైబ్రరీకి లేదా పార్కుకి వెళ్లి కాలక్షేపం. రాత్రిపూట కుటుంబ సభ్యులందరు కలిపి టిఫిన్ చేయడం కబుర్లు చెప్పుకోవడం ఒక అలవాటుగా మారిపోయింది. ఇలా రఘురామయ్యగారికి చేదోడువాదోడుగా ఉంటూ కుటుంబ సభ్యులకు తలలో నాలికలా మెలుగుతూ రిటైర్మెంట్ జీవితం హాయిగా గడిపేస్తున్నారు ఆ దంపతులు . సోమయాజులు గారి భార్య వంట మనిషికి వంటలు పురమాయించడం పనివాళ్లతో ఇల్లు శుభ్రం చేయించడం వైదేహి పిల్లల బాధ్యత తో ఆమెకి కాలక్షేపం అయిపోతోo ది.

ఏదైనా పల్లెటూర్లో పుట్టి పెరిగిన వాళ్ళు చాలా ఆప్యాయంగా ఉంటారు. సహాయం చేయడానికి వెనుకాడరు. అందరితోటి ఇట్టే కలిసిపోతారు. ప్రేమాభిమానాలు ఎక్కువ. అందుకనే సోమయాజులు గారి దంపతులు ఆ కుటుంబ సభ్యులతో బాగా కలిసిపోయారు. అందరికి బాగా అలవాటైపోయారు. పైగా రఘురామయ్య గారు కూడా పల్లెటూరు నుంచి వచ్చినవారే.
అందుకే లింక్ బాగా కుదిరి ఇద్దరూ సింక్ అయిపోయారు.

 అయితే సోమయాజులు గారికి ఒక విషయంలో మొహమాటంగా ఉంది. ఇంటికి అద్దె తీసుకోవడం లేదు
పైగా భోజనాలు కాఫీలు టిఫిన్లు అన్ని అక్కడే. బోలెడంత ఖర్చు.

ఇదే విషయం రఘురామయ్య గారి తోటి ప్రస్తావిస్తే ఆయన నవ్వి
బావగారు మీరు చాలా తెలివైన వాళ్ళు మీరు రోజు కూరగాయలు పాల ప్యాకెట్లు నెలకొకసారి కిరాణా సామాన్లు తెచ్చి పడేస్తున్నారు.మీకు ఏనాడు డబ్బులు ఇవ్వలేదు మీకు మీరు కూడా మా కుటుంబ సభ్యులే అంటూ మాట మార్చేశారు.

ఇలా పది సంవత్సరాలు గడిచే యి. వైదేహి మరు దలు అందరికీ ఉద్యోగాలు వచ్చి పెళ్లిళ్లు అయిపోయాయి. వైదేహి పిల్లలకి ఒడుగులు కూడా అయిపోయాయి. ఈ కార్యక్రమాలన్నిటిని సోమయాజులు గారు భార్య దగ్గరుండి పూర్తి చేశారు.
ఒకరోజు ఉన్నట్టుండి సోమయాజులు గారు మరియు భార్య రెండు నెలలు తేడాతో హార్ట్ ఎటాక్ వచ్చి కన్నుమూశారు. వైదేహి మరుదులు భార్యలతో సహా వెంటనే వచ్చి పాడె మోసి వైదేహి పెద్ద కొడుకు చేత కర్మకాండలు శాస్త్ర ప్రకారం దశ దానాలు భారీ ఎత్తున చేసి ఒక పెళ్ళిలా జరిపించారు. మగ పిల్లలు లేకపోయినా తమను నమ్ముకుని తమ ఇంటికి వచ్చిన వియ్యంకుడి ఆఖరి యాత్ర దగ్గరుండి పాపం రఘు రామయ్య గారు పిల్లలకు అన్నీ చెప్పి చేయించారు. భారీ ఎత్తున సంతర్పణం చేశారు. 
తల్లి తండ్రి పోయి పుట్టెడు దుఃఖం తో బాధపడుతూ తమ అత్త వారు తన కన్న తల్లిదండ్రులకు చేస్తున్న ఈ కార్యక్రమం చూసి చాలా సంతోష పడింది. చుట్టుపక్కల వాళ్ళు బంధువులు రఘురామయ్య గారు సోమయాజులు గారి దంపతులు పట్ల చూపించిన కరుణ ప్రేమ ఆప్యాయత అభిమానం చూసి చాలా ఆనందపడ్డారు.
నిజమే ఇటువంటి కుటుంబాలు చాలా అరుదుగా ఉంటాయి. ఇది కథ కాదు. వాస్తవానికి దగ్గరగా ఉన్న జరిగిన కథ. కొన్ని మాత్రమే కల్పితం. ఇది నేను చూసిన కుటుంబం. రక్తసంబంధీకులే బాధ్యతలు తీసుకోవడానికి దూరంగా జరిగి వెళ్లిపోతున్నారు. అలాంటిది వియ్యాలవారు ఇలా చేస్తారా అనే సందేహం అందరికీ కలుగుతుంది. చాలా అరుదుగా ఉంటారు ఇటువంటి వాళ్ళు. వీళ్ళని ఆదర్శమూర్తులు అనవచ్చు. ఆచరించి చూపించారు. 

అయితే ఇక్కడ సోమయాజుల పాత్రధారి కూడా ఎక్కడ వివాదాలకి తావు ఇవ్వలేదు. అందరితో కలిసి మెలిసి కాలం గడుపుకుంటూ వచ్చాడు. ఇది చదువు నేర్పిన సంస్కారమా లేదా పెద్దలు నేర్పిన సంస్కారమా.నేను పెద్దల నేర్పిన సంస్కారమే అంటాను. పదిమందితో కలిసిమెలిసి తిరుగుతూ బాధ్యతలు పంచుకుంటూ నవ్వుతూ బతికేస్తే సంఘంలోనూ మంచి పేరు వస్తుంది . కుటుంబంలో ను మంచి పేరు వస్తుంది.
జీవితం సుఖంగా జరిగిపోతుంది.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
         కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట