నా రథం

పుట్టడం అందరి బిడ్డలులాగే అమ్మ కడుపున.
ఎవరి దిష్టో పోలియో శాపo పసిప్రాయంలో.

మానవుడి జీవిత గమనం రెండు కాళ్ళతో.
నా జీవిత గమనానికి మూడు కాళ్లు .
          అందుకే నేను ప్రత్యేకం.
          దాని తోటే నా జీవితం.
      అదే మూడు చక్రాల రథం.

  దేవుళ్ళు ప్రతి పండక్కి రథంలో ఊరేగింపు 
 నేను నారథoతో పాటు ప్రతి చోట విహరింపు.

     ప్రతి ఆశయానికి గమనం ముఖ్యం
      నా ప్రతి ఆశయ సిద్ధికి నా రథం నా అదృష్టం.

     నా బిడ్డలు నా రథానికి వెనకుండే చక్రాలు.
     ముందుండి నడిపించే ముద్దుల చక్రం భార్య .
     కుటుంబ సభ్యులు నా మార్గదర్శకులు.
   బతుకు జట్కా బండి కాదు. 
రాజధాని express రైలే.
    
  మూడు చక్రాల రధం ఎంతో పరోపకారి.
  నా అభివృద్ధికి ఎంతో ఉపయోగకారి.
 
నా లాగే బండి కూడా సహనం ఎక్కువ.
పనిభారం పెరిగనా పల్లెత్తు మాట్లాడను
వయసుతో పాటు నా భారం పెరిగిన కిమ్మనకుండా గమ్యం
చేరుస్తుంది నా బంగారు రథం.

నా రథానికి చమురు అక్కర్లేదు
చదునైన నేల అంటే ముద్దు.
ఎత్తుపల్లాలు అంటే భయం
ర్యాంపులు ఉంటే పంచ కళ్యాణి గుర్రం.
డిక్కీ కొలతలు చూసుకుని మరీ ఎక్కుతుంది వాహనం.

నా రథం ఎవరెస్టు శిఖరం ఎక్కించ లేదుగానీ
నాతో పాటు ఆఫీస్ లన్ని తిరుగుతూ నా ఆశయం
నా కలలు బాధ్యతలు బంధాలు తీరం చేర్చింది.

రథం ఇనుప ముక్కే గాని మనసు వెన్న ముద్ద.
తరతరాలుగా అవిటి వారికి అదే సాయం.
ఏమి తీర్చుకోగలం దాని ఋణo.

మధ్యలో వచ్చిన రథంతో మహదానందం.
మొదటి నుంచి ఉంటే నా కలలన్నీ సాకారం.
నాలాంటి వాళ్ళకి పెద్దల పేరు మీద మూడు చక్రాల రథం 
ప్రతి సంవత్సరం దానం,
నేను ఎంచుకున్న వ్రతం.
 వ్రత ఫలం మాట ఎలా ఉన్నా
లబ్ధిదారుల గమనానికి లేదు భయం.
వారి అభివృద్ధికి అదే దోహదo.

ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ 
అది మోసిన బోయీ లెవ్వరు
శ్రీ శ్రీ గారి మాటలు.
అలాగే ఈ రథ శిల్పి కి నా జోహార్లు.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.
                        కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట