పోస్ట్‌లు

శ్రీమతి లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

శ్రీమతికి. అక్షర బహుమతి

శ్రీమతికి అక్షర బహుమతి   అందరూ అడుగుతుంటారు మీ ఆయన ఏం బహుమతి ఇచ్చాడు నీ పుట్టిన రోజుకని! నిజానికి ఏం ఇవ్వాలి? ఇది మా తరానికి ఒక పెద్ద ప్రశ్న. జవాబు దొరకని ప్రశ్న. ఒక గులాబీ పువ్వు చేతిలో పెట్టి ఐ లవ్ యు అంటే హాస్యాస్పదంగా ఉంటుంది. . షాజహాన్ లాగా ఒక తాజ్ మహల్ కట్టించే ఆర్థిక స్తోమత ఉండదు. కొత్త చీర కొనుక్కోమంటే ఇంట్లోనే కొత్త చీరలు ఉన్నాయి అంటారు. అంత పొదుపుగా ఉంటారు ఆడవాళ్లు. పోనీ మనమే ఇష్టమైన స్వీటు తయారుచేసి పెడదామంటే ఆ సామ్రాజ్యం మాది. మీరు మా రాజ్యంలోకి రాకూడదంటారు. బజారు స్వీట్లు ఆరోగ్యానికి మంచిది కాదంటారు. కానీ ఆ కేకు ముక్కలు ఫ్రిజ్లో పెట్టుకుని తింటారు. పోనీలెండి వాళ్ళ ఇష్టప్రకారమే కానిద్దాం. అది కూడా ఒక బహుమతి వాళ్లకి. నిజానికి ఒక యువకుడికి మంచి యువతి తో అలాగే ఒక యువతికి మంచి యువకుడితో వివాహం కుదర్చడం భగవంతుడు ఇచ్చిన ఒక పెద్ద బహుమతి వారిద్దరికీ. యువత జీవితంలో వివాహం అత్యంత ప్రాముఖ్యత ఉన్న షోడశ సంస్కారాల్లో ఒకటి. వివాహం తోటే జీవితం సుఖ సంతోషాలతో గడుస్తుంది. ఒక మంచి భార్య కానీ భర్త గాని దొరికినప్పుడు.  అలాంటి భాగ్యలక్ష్మి లాటరీ నాకు తగిలిందని చెప్పాలి. ఆ విషయంలో నేన...