పోస్ట్‌లు

భార్య లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

భార్య

భార్య సాయంత్రం నాలుగు గంటలు అయింది కాకినాడ పిఠాపురం రోడ్ లో ఉన్న బోట్ క్లబ్ పార్క్ రోజు వాకింగ్ కోసం వచ్చేవాళ్ళ తో ,ఆటలాడుకునే పిల్లలతో, మూలగా ఉన్న బెంచీల మీద కూర్చున్న ప్రేమికులతో చెరువులో చిన్న పడవలతో షికారు చేసే వాళ్ళ అరుపులతో, ఆ చెరువు మీద నుంచి వచ్చే చల్లటి గాలితో చాలా సందడిగా ఉంది. వాతావరణం అంతా ఆహ్లాదకరంగా ఉంది. సాధారణంగా మనశ్శాంతిగా ఉంటుందని ఇటువంటి ప్రదేశాలకు వస్తారు. కానీ ఆ పార్కులో మూలగా ఉన్న బెంచి మీద ఒంటరిగా కూర్చున్న ఇరవై ఐదు ఏళ్ల వయసున్న యువతి సునీత మనసంతా కోపంతో రగిలిపోతోంది. రెండు సంవత్సరాల నుంచి భర్త ప్రవర్తనలో ఏమి మార్పు లేదు. అన్ని విషయాలలోను బాగానే ఉంటాడు. బాగానే చూసుకుంటాడు. మరి డబ్బు దగ్గరికి వచ్చేటప్పటికి ఎక్కడలేని పిసినారితనం. అప్పులు చేయవద్దు ఉన్న దాంట్లోనే సర్దుకోమంటాడు. సునీత కేమో టూర్లకి వెళ్లాలని సరదా. ఖరీదైన వస్తువులు కొనుక్కోవాలని కార్లలో షికార్లకి వెళ్లాలని ఒక ఆశ.ఆరు నెలలకు ఒకసారి ఏదో ప్లాన్ చేస్తూనే ఉంటుంది. భర్త దానికి ఒప్పుకోడు.  అన్నిటికీ డబ్బే ఆధారం. డబ్బు లేకుండా ఎలా గడుస్తుంది ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు కదా. అందుకనే డబ్బులు పొదుప...