పిడత కంది పప్పు
పిడత కంది పప్పు సాయంకాలం నాలుగు గంటలు అయితే చాలు అన్ని వయసు వాళ్ళ ఆకలి తీర్చే నాలుగు చక్రాల బండి నాలుగు వీధులలో కనబడే బండి. నలుగురు మెచ్చే మిర్చి బండి.అదే పిడత కిందపప్పు బండి. యువతను కట్టిపడేసే చాట్ బండి. ఒకసారి సరదాగా అలా చాట్ బండి చూసి వద్దాం పదండి.ఈ బండి కి నాలుగు చక్రాలు ఉండి చుట్టూ రంగురంగుల అద్దాల డబ్బా లుతో మెరిసిపోతూ పైన ఒక స్టూలు ,కాగితoముక్కలు ఒక అరలో అలంకరించుకుని సందుల్లో గొందుల్లో పార్కు దగ్గర పాఠశాల దగ్గర ఆఫీస్ దగ్గర ఆసుపత్రి దగ్గర అందంగా నిలిచి ఉంటుంది. మన చాట్ బండి. ఉదయం నుంచి శ్రమపడి కావాల్సిన ముడి సరుకులు తెల్లగా మల్లెపూలులా ఉండే మరమరాలు కారం ఉప్పు అటుకులు నిమ్మరసం ఉడికించిన బటాని బుల్లి సమోసాలు మిర్చి బజ్జీలు అరటికాయ బజ్జీలు వాసన వీధి అంతా అదరగొడుతుంటే ఏ మూలకైనా చేరిపోయి అందంగా నిలిచి ఉండి మంచి వాసనలతో అందర్నీఆహ్వానిస్తుంది అనేకంటే ఆకర్షిస్తుందని చెప్పడం మేలుబండి మధ్యలో ఉడుకుతున్న బటాని . కింద గ్యాస్ బండ పెట్టుకోవడానికి ఒక ప్రత్యేకమైన ప్రదేశం. ఇంత సౌకర్యవంతంగా తయారుచేసిన ఈ బండి రూపశిల్పికి ముందుగా నమస్కారం. మన ఇంట్లో కిచెన్ లో అ...