పోస్ట్‌లు

గూర్ఖా లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

గూర్ఖా

గూర్ఖా  వీధి వీధి తిరిగి నిశి రాత్రంతా జాగరణ చేసి  చిమ్మ చీకటిలో మన సొమ్ముకి కాపు కాసి మనం సొమ్మసిల్లి నిద్రపోయేలా చేసి  నెలాఖరులో సలాము చేసే పరదేశి  ఊరు తెలియదు పేరు తెలియదు  జాతి పేరుతోనే చలామణి. తరతరాలుగా లేదు ఆదరణ అయినా చిమ్మ చీకటిని నమ్ముకుని  బ్రతుకు సాగిస్తున్నాడు ఈ బడుగు జీవి.  సలాము కొట్టి గుమ్మoల్లో నిలబడితే  సాకులు చెప్పకుండా సంతోషపెడదాం. రచన మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు.  కాకినాడ 9491792279