దీపం
చీకటిని పారద్రోలేది దీపం. జ్ఞానానికి సంకేతం దీపం. వృక్షం శ్వాస ఇచ్చి తనువును కాపాడుతుంది. నలుగురు నడిచే రహదారిలో వెలుగు చూపేది దీపవృక్షం. జీవకోటికి ఈ రెండేగా ఆధారం. శ్వాస ఉంటే వెలుగులో నడిచి గమ్యం చేరుకుంటాడు మానవుడు. ఇంటికి దీపం ఇల్లాలు. ఆమె కళ్ళలో వెలుగు ఇంటికి శ్రీరామరక్ష. దీపముల పేరుతో ఒక పండుగ దీపావళి. ప్రతి పూజ జ్యోతి ప్రజ్వలన తోనే ప్రారంభం. కారు చీకట్లో రవంత వెలుగు ఇచ్చు కొండంత ధైర్యం. అందుకే వెలుగు అంటే ధైర్యం చీకటి అంటే భయం. అద్దాల గూడులో ఉండే దీపం పేరు లాంతరు. గూడులో ఇది లేకపోతే బ్రతుకు జంతర్ మంతర్. కోడిగుడ్డు ఆకారంలో ఉండేది కోడిగుడ్డు లాంతరు. జీవితాన్ని కొడగట్టిన దీపంతో పోలిక. ఆరిపోతున్న దీపాన్ని కొండెక్కుతుంది ఉంటారు. మైనపు ముద్దు అయితేనేo మందికి వెలుగు చూపేది కొవ్వొత్తి. దీపం ఆర్పి పండుగ చేసుకోవడం ఆంగ్ల సాంప్రదాయం. మన పూజలన్ని దీపం తోటే ప్రారంభం. థామస్ ఆల్వా ఎడిసన్ గారి పుణ్యం విద్యుత్ దీపం. రాత్రి పగలు దానితోనే మానవ జీవితం మమేకం. కార్తీకమాసంలో ఆకాశదీపం వెలిగించడం సంప్రదాయం. పున్నమి వెలుగును మరింత పెంచు కార్తీక దీపం. ఆ దీపం తోటే కదా పుణ్యం పురుషార్థం. తల దగ్గర పెట...