పోస్ట్‌లు

స్ఫూర్తి లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

స్ఫూర్తి ప్రదాత

స్పూర్తి ప్రదాత. నిన్న మొన్నటి వరకు మన మధ్య పెరిగిన పిల్లకి ఇలా జరిగింది ఏమిటి ? భగవంతుడు ఎంత నిర్దయుడు. ఆ ముక్కు పచ్చలారని పిల్ల బతుకు ఇలా బుగ్గిపోయింది ఏమిటి? పెళ్లయిన తర్వాత మొదటి పండుగ సంక్రాంతికి వచ్చిన ఆ జంటను చూస్తే ఎంత ముచ్చటగా ఉంది. మన మధ్య పెరిగిన ఈ పిల్ల నిజంగా బంగారమే. పాలమీగడ లాంటి శరీరం బొద్దుగా ఎత్తుగా ఎంత బాగుండేది ఈ పిల్ల. రెండు పదులు దాటకుండానే దాని జీవితం అలా అయిపోయింది ఏమిటి ? ఇంకా సంక్రాంతి సంబరాలు ఎవరు మర్చిపోలేదు ఇంతలోనే పిడుగులాంటి వార్త ఆ ఊరి ప్రజలను కలిచి వేసింది. ఏ నోట విన్నా ఇదే మాట. ఒక రకమైన భయంతో ఆ ఊరి ప్రజలు వణికిపోయారు. ఊరి ప్రజలే అలా ఉంటే ఆ కుటుంబ సభ్యులు ఇంకెలా ఉంటారు.విధి వ్రాతను ఎవరూ తప్పించలేరు. ఆనందంగా గడుపుదామని సంక్రాంతి పండుగ రావడo ఏమిటి అరుగు మీద కూర్చుని పళ్ళు తోముకుంటుంటే అల్లుడుగారిని కుక్క కరవడం ఏమిటి? తర్వాతే ఎంతమంది చెప్పిన నిర్లక్ష్యం చేసి వైద్యం చేయించుకోవ పోవడo ఏమిటి ఇవన్నీ తలరాత కాకపోతే ఏమిటి అనుకుంటూ రాజ్యలక్ష్మి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.  కళ్ళ ముందు జరిగిన సంఘటనలన్నీ ఒకసారి గుర్తుకొచ్చి మరింత ఏ...