పయనం

చేతబట్టిన దీపం గూడుకు వెలుగు చెయ్యి పట్టిన వాడికి నువ్వే వెలుగు. నీ వరాల మూటతో వంశమంతా వెలుగు నిన్ను చూడగానే జన్మనిచ్చిన వారి కళ్ళు వెలుగు అందరికీ వెలుగులు పంచుతావు కొడిగడుతున్న దీపంలా నువ్వు ఉంటావు. గుండె లోతుల్లో బాధలు ఉన్న చిరునవ్వు పంచుతావు. నీ మౌనం వెనక ఎన్నో కథలు గుండెను పిండేసిన వ్యధలు అయినా నీ పయనం యధాతధం ఎక్కడ నుంచి వచ్చింది నీకు అంత సహనం. రచన. మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు కాకినాడ 9491792279