తెలుగు
"తెలుగు అమ్మా అనే మాట మరచిపోయింది కన్న పేగు మమ్మీ తో మొదలైంది తొలి పలుకు అరవై ఏళ్ల ముదుసలిని తాత అంటే ఉరిమి చూస్తాడు అంకుల్ అంటే ఆనందం మావయ్య మాటే మరిచాము ఇక అత్తయ్యను పిలిచే బంధం లేదు ఒరేయ్ అనే పిలుపు పారిపోయి సినిమా పిలుపు స్నేహితుల మధ్య దూరింది ఆంగ్లం మా ఆఫీసు భాష సారు అంటే గాని పలకరు మా మేనేజర్ శుభోదయం అంటే ఎగాదిగా చూస్తాడు పరభాష సంబంధాలతో పయనిస్తోంది తెలుగు కుటుంబం కన్నబిడ్డలు పలాయనం చిత్త గిస్తే కన్నీరు పెడుతోంది తెలుగు తల్లి చీరలు వదిలేసి నైట్ డ్రెస్ వేసుకుని బొట్టు చెరిపేసి ఫౌండేషన్ పూసుకున్నాం కేకు ముక్క కోసి దీపాలు ఆర్పి పండగ చేసుకుంటున్నాం బాపు బొమ్మలు గోడలపై కనిపించవు బొమ్మల కథలు చెప్పే పెద్దవాళ్లు లేరు పాటలు బాగుంటే సైతం “కూర్చొని వినే టైం లేదు” అంటారు పద్యానికి పట్టం లేక పరిచయానికే పద్యం మిగిలింది కలలు కన్నవారికి కళల పట్ల కన్నీరు మిగిలింది అయినా ఎక్కడో ఆశ కాలం తిరోగమించి వర్ణమాలకు వెలుగులు తెస్తుందని. ఓ చిన్న చిగురుగా ఓ చిన్న శ్వాసగా ఒక రోజు వస్తుంది తెలుగు మళ్లీ పుట్టే రోజు పదానికి పదం తోడై ప్రతి ఇంటా పద్యం పాడే రోజు! రచన మధునాపంతుల చిట్టి వెంకట స...