పోస్ట్‌లు

ఇద్దరు లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ఇద్దరు ఇద్దరే

ఇద్దరు ఇద్దరే  " అమ్మ వచ్చే నెలలోనే నీ పుట్టినరోజు కనీసం ఈ పుట్టినరోజుకి అయినా ఒక చీర కొనుక్కో అంటూ కూతురు రమ్య చెప్పిన మాటలకి మౌనంగా ఉండిపోయింది వసంత. వసంత మౌనానికి అర్థం రమ్యకు తెలుసు అందుకే మళ్లీ ఆ విషయం రెట్టించకుండా ఉండిపోయింది .అయినా అమ్మ కష్టం ఇంకెన్నాళ్లు అన్నయ్య చదువు అయిపోతో oది. క్యాంపస్ లో ఎక్కడో అక్కడ ఉద్యోగం వస్తుంది. అన్నయ్య అంది వచ్చాడంటే అమ్మ సమస్యలన్నీ తీరిపోతాయి. కుటుంబం ఒక దారిలో పడుతుంది . పాపం నాన్న అకస్మాత్తుగా చనిపోవడంతో అమ్మ మీద ఈ కుటుంబ బాధ్యత పడి కుటుంబాన్ని ఇలా గుట్టుగా నెట్టుకొస్తోంది అనుకుంటూ చదువులో మునిగిపోయింది రమ్య. వసంత భర్త రాజారావు ఒక గవర్నమెంట్ ఆఫీస్ లో ఉద్యోగి. అనుకూలవతి అయిన భార్య తో ఇద్దరు పిల్లలతో మంచి ఇంట్లో ఆనందంగా కాలక్షేపం చేసేవారు. రాజారావు పెద్ద జీతగాడు కాకపోయినా ఉన్నదాంట్లోనే తృప్తిగా జీవించేవారు. అలాంటి కుటుంబానికి దిష్టి తగిలింది ఏమో హఠాత్తుగా రాజారావు గుండెపోటుతో చనిపోయాడు. రాజారావు భార్య వసంత పెద్దగా చదువుకోలేదు. అయినా గవర్నమెంట్ వారు దయ తలచి రికార్డ్ కీపర్ గా ఉద్యోగం ఇచ్చారు. రాజారావు బతికున్న రోజుల్లో బాగా బతికినా అంత పెద్ద...