కాలం ⏰⏰

కాలం

రోజులు నెలలు సంవత్సరాలు
మానవాళి అందరికీ ఒకటే.

కానీ ఎవరి కాలం వారిదే.
కాల మహిమ అనూహ్యం.

దేవుడు మహిమ కన్న, కాల మహిమ మిన్న.
రేపే అనుకొన్న పట్టాభిషేకం .
తెల్లవారే సరికల్లా రాముడు అరణ్యవాసం. 
అరణ్యవాసము కాల మహిమ.

ఆవిడ మహాపతివ్రత అయితేనేం
ఆమెకి తప్పలేదు దుశ్శాసనుడి దౌర్జన్యం.
అతి రథ మహారధుల సభలో.
కాల మహిమ చెప్పలేం.

కృష్ణుడికి తప్పలేదు నీలా పనిందలు.
మనమెంత మానవ మాత్రులం.

వాలి సుగ్రీవులు ఇద్దరు ఏకోదరులు.
వాలి మరణానికి సుగ్రీవుడు కారణం 
వాలి కాలం అలా ఉంది.

ఎప్పుడూ ఎక్కే విమానమే.
ఆ రోజే రాజశేఖరుడి ఆఖరి జీవన యానం.
ఎటుపోయిందో కూడా తెలియని విమానం.
కాలమహిమకు లేదు కొలమానం.

తల్లి కొడుకులిద్దరూ దేశ ప్రధానులే.
చుట్టూ అత్యున్నత రక్షణ వలయం.
వలయం చేదిస్తూ తుపాకీ గుండ్ల చే హతం.
బ్రహ్మ అలా వ్రాశాడు తలరాత.
అక్షరాల పాటించింది కాలం.

ఏడ్చే వాళ్లని నవ్వించడం హాస్య నటుల వరం.
కోట, బాబు మోహన్ లకు తప్పలేదు పుత్ర శోకం.
ఒకే చోట ఒకే రీతిలో వరుసగా రోడ్డు ప్రమాదం.
కాలమా నీ లీలలు ఎంత దారుణం.

పసిపిల్లల అందరి బాల్యం అమ్మ చంకలో 
నా యవ్వనం వచ్చేవరకు అమ్మ చంక తోటే నా గమనం
బాల్యంలో లో కాలo వేసిన పోలియో కాటు
ఇది నా స్వానుభవం 
బ్యాంకు ఉద్యోగిగా మార్చింది ఆ కాలమే.
కాలం మంచిదా చెడ్డదా తెలియని అయోమయం.

కాలం చెల్లిపోయింది వెళ్లి పోయింది అనుకున్న కరోన.
తిరగబడి విరగబడుతోంది ఒమక్రన్ పెనుభూతమై.
ఎన్ని అనుకున్నా ఏం లాభం కాలం బాగోనప్పుడు.

కాలం చెల్లి పోతే అది ప్రాంసరీ నోట్ అయిన
వెయ్యి రూపాయల నోటు అయినా చిత్తు కాగితమే.

తెలుగు వారి కోసం ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రం.
ప్రాంతాలవారీగా విడిపోవడం కాలానుగుణంగా వచ్చిన మార్పు.
ప్రతిచోటా కాలమే వేస్తోంది పెద్ద పీట.

వరకట్న చావులు .యాక్సిడెంట్లు .ఆడవాళ్లపై అకృత్యాలు
ఆస్తి తగాదాలు కొట్లాటలు బాంబు పేలుళ్ళు
రోజు ప్రత్యేక కాలంలో లో వార్తలు మోసుకొస్తున్న పేపర్లు.
ప్రపంచ కాలం ఇలా ఉంది .

అన్ని బాగుంటే అంటారు పెద్దలు.
బాగుండటం అంటే కాలం బాగుండటం.
బాల్యంలో అర్థంకాని పెద్దల మాటలు.

కాలం బాగుండాలంటే ఏం చేయాలి.
తరతరాలుగా అది అర్థం కాని ప్రశ్న
జవాబు చెప్పలేని తరతరాలు.
జవాబు తెలిసినది ఒక్కరికే కనిపించనీ దైవానికి.

ఆ క్షణం ఏడుస్తాం కాలం బాగాలేదని.
మరుక్షణం గతాన్ని మర్చిపోతాం
అదే దేవుడు నీకు ఇచ్చిన వరం,
 సమాధానం.

ఉందిలే మంచి కాలం ముందు ఉందిలే
చెప్పింది ఒక సినిమా గీతం అదే మనందరికీ ఉత్తేజం.

రచన: మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.
           కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆరోగ్యం వర్సెస్ ఆహారపు అలవాట్లు

కుటుంబం

సాయంకాలం సాగర తీరం