కడ దశ
కనిపెంచిన అమ్మను కడ దశలో
కార్పొరేట్ స్థాయి కాకపోయినా
కరుణతో చూడవలె గాని
పశువుల శాలకు అంకితం
విజ్ఞులకు ఇది విధితమా విశ్వేశ్వరా
ప్రాణం పణంగా పెట్టి నవమాసాలు మోసి
తన రక్తమే చనుబాలుగా మార్చి
బాలారిష్టాలు దాటించి మనిషిగా పెంచి
మమతలు పెంచి మంచిని నేర్పిన
కన్నతల్లి కి ఇన్ని ఇక్కట్లా మహేశ్వరా.
అంతరిక్షంలో ఎగిరిన మనిషికి జ్ఞానం శూన్యం.
అజ్ఞానాంధకారంలో మనిషి గమనం.
మాతృదేవోభవ అని వల్లించడానికే పెదవులు.
ఆప్యాయంగా కన్నతల్లిని ఇంటిలోనికి
ఆహ్వానించడానికి రావు చేతులు.
కడ దశలో ఉన్న అమ్మను గడప దాటించడం
ఎవరు నేర్పారు మానవునికి ఈ సంస్కారం.
చిత్రము చూడగానే చూపరులకు తీయని బాధ
అనుభవించే కన్నతల్లి భాధ నీకే తెలుసు.
మనిషికి విజ్ఞత నేర్పే బాధ్యత నీదే సర్వేశ్వరా.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.
కాకినాడ.9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి