పశువులు
మన నగరాల్లో జనాభా విపరీతంగా పెరిగిపోతోంది. దానికి తోడు వాహనాల సంఖ్య రోడ్లమీద వాహనాల సంచారం విపరీతంగా పెరిగిపోయింది. దానికి అనుగుణంగా మన రోడ్ల పరిస్థితి రోజు రోజుకి దిగజారి పోతుంది. పెరిగే జనసంచారం కనుగుణంగా, వాహనాల సంఖ్యకు అనుగుణంగా రోడ్లు వెడల్పు చేయడం ప్రభుత్వం వారికి తలనొప్పిగా తయారైంది దానికి తోడు బడ్జెట్లు కూడా అంతంత మాత్రం. అయితే పూర్వ కాలంలో ఏడాదికో రెండేళ్ళకో సారి రోడ్ల పరిస్థితి పై ప్రభుత్వం వారు సమీక్ష చేసేవారు. ఇప్పుడు ప్రతి రోజు ట్రాఫిక్ సమస్య పై, రోడ్ల పరిస్థితి పై సమీక్ష చేయవలసిన అవసరం ఏర్పడు తోంది. దానికితోడు రోడ్లపై పశువుల సంచారం కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఇవి రోడ్డు మీద యధేచ్చగా తిరుగుతూ వాహనాలకి అడ్డుగా వచ్చి అనేక యాక్సిడెంట్ లకి కారణం అవుతున్నాయి. పశువు అనగా పాశం చేత కట్టబడింది అనగా త్రాడు చేత కట్టబడింది. మనదేశంలో పశుపోషణ కూడా అతి ముఖ్యమైన వృత్తి. గ్రామాల్లో ఈ పశువులకి ఒక కాపలాదారు ఉంటారు. యథేచ్ఛగా రోడ్లమీదకు వదలరు. అయితే ఇటీవల కాలంలో నగరాలలో కూడా వృత్తిరీత్యా అయితే నేమి సరదా కోసం అయితే నేమి పశుపోషణ జరుగుతోంది. గోవు యొక్క ప్రాముఖ్యతను ప్రతి ఒక్క...