ఇటుక

ఇటుక

కాళ్ల కింద నలిగిన మట్టి 
అచ్చులోదూరి 
అమ్మలా మారి 

కొలిమి చేరి 
ఒళ్ళు కాల్చుకుని 

చల్లబడి మాలు అద్దుకుని 
గోడకు ఆధారమై 
మేడను నిలబెట్టి

కలకాలం కష్టసుఖాలన్నీ 
 చూస్తూ 
గోడు వినే నాథుడు లేక 

వంద ఏళ్ళు అయిన 
నడ్డి విరగకుండా 
ఇటుక మంచిది 
అని ప్రైజులు కొట్టేస్తుంది.

మట్టి పిసికి 
అచ్చు పోసిన మహారాజుని 
పూరి గుడిసె వెక్కిరిస్తుంది 

అరచేతిలో స్వర్గం చూపించే 
షావుకారిని రెండంతస్తుల మేడ 
 గర్వంగా తల 
పైకెత్తుకుని తిరిగేలా చేస్తుంది. 

నాది డూప్లెక్స్ 
మెయిన్ రోడ్ లో ఇంకొక కాంప్లెక్స్ 
అన్నింటికీ ఆ ఊరి ఇటుకే 
పైసా ఖర్చు లేని పబ్లిసిటీ ఇటుక ముక్కకి

మట్టి పిసికిన మహారాజు 
ఎప్పటికీ తెర వెనుక బొమ్మే
ఎవరో చెప్పినట్టు ఆడుతున్న 
తోలుబొమ్మ.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు 
కాకినాడ 
9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆరోగ్యం వర్సెస్ ఆహారపు అలవాట్లు

కుటుంబం

సాయంకాలం సాగర తీరం