బీరువా

బీరువా

గదిలో మూలనున్న గది కే అందం.
విలువైన వస్తువులన్నీ నా వడిలో భద్రం.
నాన్న నెల జీతం 
అమ్మ ఆభరణం
పెళ్లినాటి పట్టు చీరలు.
వెండి సామాన్లు
పిల్లల ప్రశంసాపత్రాలు
నా ఒడిలో భద్రపరిస్తే యజమానికి ఆనందం.
కమ్మగా నిద్రిస్తారు కలతలు లేకుండా.

కొత్త కాపురానికి పంపించేటప్పుడు
అమ్మాయితో పాటు అత్తారింటికి.
అందంగా ఆ గదిలో చేరుతాను.
మౌనంగా ముద్దు ముచ్చట కళ్లుమూసుకుని వింటాను
ఎందుకంటే రాత్రికి నా కళ్ళ కి గంతలు 
అమ్మాయికి కడుపు పండి చంటి బిడ్డ ఒడిలో చేరినా
ఏడుస్తున్న చంటి దాన్ని సముదాయించి లేను.
చంటి దాని చేతిలో పెట్టిన విలువైన వస్తువులు భద్రంగా దాచుతాను.

సంసారంలోని కలతలతో అమ్మాయి తలగడ లో తలదాచుకుని ఏడుస్తున్నా
చేరదీసి సముదాయించలేను నేను ప్రాణం లేని శిలను.
వయసు మీరినా వరదలా ప్రవహిస్తున్న 
వారి ప్రేమను చూసి సిగ్గుతో తలదించుకుంటాను.
ఎందుకంటే ఆ గది తప్ప వేరే గదిలో నాకు స్థానం లేదు.
పరువాలు పంచడానికి ఆ గదే
సంపదలు ఉంచేది ఆ గదే

నామీద కుటుంబానికి ఒక నమ్మకం
తెచ్చిన సంపాదన మూడింతలు అవుతుంది అని
ఆ పేరే తెచ్చింది మా వంశీకులకు గౌరవం.
అందుకే ప్రతి ఇంటిలో మాకు స్థానం.

పాలబుగ్గల పసిపిల్లల దొంగ పోలీస్ ఆటలో
నాకే ప్రథమ స్థానం.
నా యజమాని అప్పు కట్టలేదని
 దొరలు వస్తే భయం తగ్గించి
నా వెనకాల దాచుకుంటా.

జీవితాల ఫైలు
జీతాల ఫైలు
కాంట్రాక్టర్ జీవితం
కార్మికుల కష్టం
ప్రతి ఫైలు నా అరలలో అందంగా భద్రం.
కార్యాలయంలో కూడ నాకే ప్రధమ స్థానం.
అందుకే ప్రతి మానవ జీవితం పెనవేసుకుంది నాతో బంధం.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
          కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆరోగ్యం వర్సెస్ ఆహారపు అలవాట్లు

సామర్లకోట

కుటుంబం