మహాత్ములు
మహాత్ములు
ఆ దేవుళ్లకు ప్రత్యేక గుడులు ఉండవు
ధూప దీప నైవేద్యాలు ఉండవు
ప్రతి కూడలిలో నిత్యం మనల్ని పలకరిస్తూ ఉంటారు.
భరతమాతను దాశ్య శృoఖలాలు నుండి విడిపించిన మహాత్ములు.
దేశం కోసం ప్రాణాలర్పించిన త్యాగధనులు.
విదేశీ తుపాకి గుండ్లకు అసువులు బాసిన వీరులు.
భరతజాతికి మార్గదర్శకులు వీరు.
ప్రతి బుుతువు బొమ్మల్ని పలకరిస్తూనే ఉంటుంది.
జడివాన పెను తుఫాను ముద్దాడుతూనే ఉంటాయి.
మండే ఎండకు గుక్కెడు మంచినీళ్లు అడగదు ఈ బొమ్మ
గాల్లో ఎగిరే పక్షికి ఏమి తెలుసు
ఆ యోధుడు చేసిన త్యాగం.
దొరికిన ఆసరాతో అవసరం తీర్చుకుంటుంది.
తలకెక్కిన నిషా తో మందుబాబు
తనువెరగక బొమ్మ దరి నిద్రిస్తాడు.
బొమ్మలన్ని గలీజ్ చేస్తాడు.
మతోన్మాద మత్తుకి బలి అయ్యేది ఈ విగ్రహం.
నిగ్రహం లేని జనానికి ఏం చెప్పను.
ఏడాదికో మారు మాలలతో మెరిసిపోతుంటాయి విగ్రహాలు.
ఛాయాచిత్రాలతో పేపర్లన్నీ మెరిసిపోతుంటాయి.
వెలకట్టలేనిది ప్రాణం విలువ.
ప్రాణం అర్పించి సాధించారు స్వాతంత్రం.
మనుషులైతేనేమీ దేవుళ్ళకు తీసిపోరు వీరు.
గుడి కట్టి పూజిస్తే తప్పేంటి.
చట్టసభలలో చట్టం వస్తుందని ఆశిద్దాం.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.
కాకినాడ 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి