అలంకరణ
అలంకరణ పూర్వకాలంలో శుభకార్యాలు ఆకాశమంత పందిరి వేసి పందిరి నిండా ముగ్గులు పెట్టి ,పచ్చటి తోరణాలు కట్టి పెళ్లిళ్లు చేసేవారు. అలాంటిది కాలం మారిపోయింది. పట్టణాల్లో బహుళ అంతస్తులో భవనంలో నివాసం ఉంటూ ఎవరైనా పది మంది చుట్టాలు వస్తే ఉండడానికి సరిపోక ఇబ్బంది పడుతుంటే అటువంటిది ఇంక శుభకార్యాలు సమయంలో ఎలా సరిపోతాయి . అందుకే ఈ శుభకార్యాలన్నింటికీ పల్లెల్లోనూ పట్టణాల్లోనూ కూడా ఆకాశమంత ఎత్తులో అందంగా కల్యాణ మండపాలు కట్టి అద్దెలకు ఇస్తున్నారు. ఈ కళ్యాణ మండపాల్లో అతిథులు కూర్చోవడానికి విశాలమైన హాలు. కుర్చీలు సోఫాలు ఏసీలు డైనింగ్ హాలు అతిధి రూములు కళ్యాణ వేదిక ఒకటేమిటి సకల సౌకర్యాలు ఒకచోటే. అటువంటి కళ్యాణ వేదికలని అందంగా అలంకరించడం ఒక కళ. ఆ పెళ్లి జరుగుతున్నంతసేపు ఆ వేదిక ఒక ఇంద్ర భవనంలా ఉంటుంది .ఒక గుడిలా ఉంటుంది . ఇదంతా అలంకరణ మహిమ. ఇవాళ రేపు పుట్టినరోజులకి పండగలకి పెళ్లిళ్లకి మరి ఏ ఇతర శుభకార్యానికైనా ఇంటిని అందంగా అలంకరించుకోవడం ఒక అలవాటుగా మారింది. దీనికి ప్రత్యేకమైన నిపుణత కలిగిన వారు ఉన్నారు. కొంతమంది పూలతో మరి కొంతమంది బుడగలతో మరి కొంతమంది అందమైన అలంకరణ సామగ్రితో ఆ వేదికన...