అలంకరణ
అలంకరణ
పూర్వకాలంలో శుభకార్యాలు ఆకాశమంత పందిరి వేసి పందిరి నిండా ముగ్గులు పెట్టి ,పచ్చటి తోరణాలు కట్టి పెళ్లిళ్లు చేసేవారు. అలాంటిది కాలం మారిపోయింది. పట్టణాల్లో బహుళ అంతస్తులో భవనంలో నివాసం ఉంటూ ఎవరైనా పది మంది చుట్టాలు వస్తే ఉండడానికి సరిపోక ఇబ్బంది పడుతుంటే అటువంటిది ఇంక శుభకార్యాలు సమయంలో ఎలా సరిపోతాయి .
అందుకే ఈ శుభకార్యాలన్నింటికీ పల్లెల్లోనూ పట్టణాల్లోనూ కూడా ఆకాశమంత ఎత్తులో అందంగా కల్యాణ మండపాలు కట్టి అద్దెలకు ఇస్తున్నారు.
ఈ కళ్యాణ మండపాల్లో అతిథులు కూర్చోవడానికి విశాలమైన హాలు. కుర్చీలు సోఫాలు ఏసీలు డైనింగ్ హాలు అతిధి రూములు కళ్యాణ వేదిక ఒకటేమిటి సకల సౌకర్యాలు ఒకచోటే. అటువంటి కళ్యాణ వేదికలని అందంగా అలంకరించడం ఒక కళ.
ఆ పెళ్లి జరుగుతున్నంతసేపు ఆ వేదిక ఒక ఇంద్ర భవనంలా ఉంటుంది .ఒక గుడిలా ఉంటుంది . ఇదంతా అలంకరణ మహిమ. ఇవాళ రేపు పుట్టినరోజులకి పండగలకి పెళ్లిళ్లకి మరి ఏ ఇతర శుభకార్యానికైనా ఇంటిని అందంగా అలంకరించుకోవడం ఒక అలవాటుగా మారింది.
దీనికి ప్రత్యేకమైన నిపుణత కలిగిన వారు ఉన్నారు. కొంతమంది పూలతో మరి కొంతమంది బుడగలతో మరి కొంతమంది అందమైన అలంకరణ సామగ్రితో ఆ వేదికను కానీ ఇంటిని కానీ అందంగా అలంకరిస్తున్నారు. ఇది కంటికి ఆకర్షణగా కనబడటమే కాదు ఛాయాచిత్రాలలో అందంగా కూడా కనబడుతుంది.
ఒకప్పుడు పూల మండపాలు ,ఇప్పుడు అధునాతన టెక్నాలజీ ఉపయోగించి ఇంద్ర భవనం తలపించేలా వేదికలు నిర్మిస్తున్నారు.
అటువంటి వారిలో కాకినాడ పట్టణానికి చెందిన K G V RAJU ఒకరు. ఎంతో బాధ్యతగా ఎంతో నైపుణ్యంతో తనకు అప్ప చెప్పిన పనిని చక్కగా చేసే వ్యక్తి. ఈ కళ లోఅనుభవజ్ఞుడైన యువకుడు
రోజు చూసే మన ఇల్లు ఒకసారి ఈ వ్యక్తికి అలంకరణ కోసం ఇస్తే ఇది మన ఇల్లేనా అనిపిస్తుంది. అనుభవంతో చెప్తున్నా.
ఒక ఉదాహరణ చెప్పాలంటే కరోనా సమయంలో కూడా మా ఇంట్లో జరిగే శుభకార్యాలన్నింటికీ ఇతనే అలంకరణ చేసి మాకు ఎంతో తృప్తిని ఇచ్చాడు. అసలు వృత్తి ఒక ప్రముఖ వస్త్రాలయంలో లెక్కలు చూసే పని.
ఇంటిని అందంగా తీర్చిదిద్దడం ఒక కళ్యాణ వేదికకి మరింత శోభ చేకూర్చడం ఇతని ప్రవృత్తి. ఏ శుభకార్యానికి తగినట్టుగా అలాంటి అలంకరణ చేయడం ఇతనికి వెన్నతో పెట్టిన విద్య
ఇంటి అలంకరణ ఖర్చు వేదిక అలంకరణ ఖర్చు గాని గుండెల మీద చెయ్యి వేసుకునేలా ఉండదు. అతి సామాన్యుడుకి కూడా అందుబాటులోనే ఉంటుంది.
ఈ చిరంజీవి ఇదే ప్రవృత్తిలో పది సంవత్సరముల నుంచి కొనసాగుతూ ఎంతోమంది అభిమానం సంపాదించుకున్నాడు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి