పోస్ట్‌లు

అల్లుడు తెచ్చిన మార్పు

అల్లుడు తెచ్చిన మార్పు  " బాబు రమేష్ మీకు కావలసింది కొనుక్కోండి ఈ డబ్బుతోటి అంటూ సంక్రాంతి పండగకు వచ్చిన అల్లుడికి అత్తగారు రమాదేవి తన బ్యాగ్ లో నుంచి సొమ్ము తీసి అల్లుడు చేతిలో పెట్టింది. "వద్దండి వచ్చినప్పుడు అల్లా ఇవ్వడం ఏం బాగాలేదు. అయినా మాకు సిగ్గుగా ఉంది. దేవుడి దయవల్ల మాకు డబ్బు అవసరమేమీ లేదు ప్రస్తుతం అంటూ తిరిగి డబ్బు ఇచ్చేయబోయాడు అత్తగారికి రమేష్.  మాకు మాత్రం ఎవరున్నారు చెప్పు ఒక్కగానొక పిల్ల ఇంకెవరికి పెడతాము అంటూ బలవంతంగా జేబులో పెట్టేసారు రమేష్ అత్తగారు. రమేష్ ఏమీ చేయలేక సామాన్లు తీసుకొద్దాం అని గదిలోకి వెళ్ళాడు. అక్కడ సామాన్లు సర్దుకుంటున్న భార్య సుజాత తోటి ఇలా అన్నాడు. ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు డబ్బు ఇస్తునే ఉన్నారు ప్రతిసారి అంటూ ఫిర్యాదు చేశాడు. సుజాత ఏమి మాట్లాడకుండా ఆ డబ్బు ఇలా ఇవ్వండి అంటూ రమేష్ జేబులోని డబ్బు తీసుకుని తన బ్యాగ్ లో పెట్టుకుంది. ఆ సాయంత్రం రమేషు సుజాత హైదరాబాద్ బయలుదేరి వెళ్ళిపోయారు.  రామారావు రవణమ్మల ఏకైక సంతానం సుజాత. రామారావు ఎమ్మార్వో ఆఫీస్ లో ఒక చిరుద్యోగి. వెనక ఆస్తిపాస్తులు లేవు. అద్దె ఇంట్లో కాలక్షేపం చేస్తూ ఉన్న ...

పార్వతమ్మ

పార్వతమ్మ. రాత్రి ఎనిమిది గంటలు అయింది.  ఇంకా ఈ పిల్ల ఇంటికి రాలేదేమిటి ఒకసారి కోడలు రేవతినీ అడిగి చూద్దాం. ఏమైనా ఫోన్ చేసిందేమో అంటూ వంటిల్లు వేపు తొంగు చూసి "అమ్మా రేవతి పద్మ ఇంకా ఇంటికి రాలేదా ఏంటి చీకటి పడిపోయింది అని అడిగింది. రోజు ఇలాగే వస్తుంది అంటూ సమాధానం చెప్పింది కోడలు రేవతి. వయసు వచ్చిన పిల్ల ఇంతవరకు ఇంటికి రాకపోవడం ఏమిటి తల్లి కూడా ఏమీ చెప్పటం లేదు ఏమిటో ఈ పిల్లలు, బయట భయాలుగా ఉన్నాయి అంటూ గట్టిగా అరిచింది రేవతి అత్తగారు పార్వతమ్మ.  భయపడవలసిన పని లేదండి అత్తయ్య గారు ఈ సిటీలో ఇలాగే ఉంటారు ఆడపిల్లని కంగారు పడక్కర్లేదు ఇవి ఆ రోజులు కాదు . అంటూ ధైర్యంగా సమాధానం చెప్పింది రేవతి. ఏమిటో నాకైతే చాలా భయంగా ఉంది. మా పిల్లల చిన్నప్పుడు మగ పిల్లలైనా సరే ఆడపిల్లలైనా సరే చీకటి పడే వాళ్ళకి ఇంటికి రాకపోతే మీ మామగారు ఊరుకునేవారు కాదు. ఇప్పుడు అలా బెల్లం కొట్టిన రాయిలా కూర్చుంటున్నారు గానీ అప్పుడు చిందులు తొక్కేవారు అంటూ చెప్పుకుంటూ వచ్చింది పార్వతమ్మ.  పార్వతమ్మ రఘురామయ్యల ఆరుగురు సంతానంలో పెద్దవాడు రామరాజు. రామరాజు హైదరాబాదులో ఒక జాతీయ బ్యాంకులో రీజనల్ మేనేజర్ గా పని చ...

బుట్ట భోజనం

బుట్ట భోజనo ఆ నగరానికి పనిమీద వచ్చిన వాళ్ళు ఎవరు ఆ భోజనశాలలో అడుగుపెట్టకుండా ఉండరు. ఆ ఆతిథ్యం స్వీకరించకుండా ఉండరు. కొసరి కొసరి వడ్డించే ఆ అమృతాన్ని తిని సంతృప్తిగా మెట్లు దిగుతారు. పుచ్చుకున్న దానికి రెండు రెట్లు ఎక్కువగానే పెట్టాడు అనుకుని ఆశీర్వదించి వెళ్తారు. సుమారు యాభై సంవత్సరాల నుంచి అందరి అధరాలకు అమృతాన్ని పంచి ఇచ్చిన ఆ భోజనశాల ఏమై ఉంటుందో ఊహించండి? ఆ నగరం పేరు చెప్పుకోండి చూద్దాం. ఒక చిన్న హింట్ ఇస్తాను. దాని పేరు బుట్ట భోజనం. అమ్మ చేతి వంటలా మురిపిస్తుంది. విందు భోజనాన్ని మరిపిస్తుంది. బుట్టలో ఒదిగి మీ ముంగిట వాలుతుంది. ఆ వీధి పేరు ఒక ప్రముఖ నటుడిది. ఆ భోజనశాల పేరు ప్రపంచానికి మార్గదర్శకమైన గీతను బోధించినవారి పేరు. ఈ బుట్ట భోజనం కాకినాడ మహానగరంలోని సుబ్బయ్య గారి హోటలు వారి ట్రేడ్ మార్క్..సుమారు 50 సంవత్సరాల క్రితం విద్యార్థులకి క్యారేజీలతో భోజనం సరఫరా చేసే ఒక చిన్న భోజనశాలగా నగరంలో అడుగుపెట్టి ఈనాడు రాష్ట్రంలోనూ పొరుగు రాష్ట్రంలోను శాఖలు పెట్టి ప్రజాదరణ చూరగొన్న సుబ్బయ్య గారు హోటల్ రుచికి మహారాజు, ఆతిథ్యానికి పెట్టింది పేరు. కాకినాడ మహానగరానికి వన్నెతెచ్చిన భోజన శాల....

మారిన పల్లె

మారిన పల్లె   పల్లెటూరు అనగానే చుట్టూ పచ్చని పొలాలు ,పిల్ల కాలువలు పెద్ద కాలువలు ,కాలువగట్లు ,కొబ్బరి తోటలు, అరటి తోటలు మామిడి తోటలు ,చల్లటి పైరగాలి,పెద్ద పెద్ద పెంకుటి ళ్లు ఇలా బాపూగారి బొమ్మలా ఉంటాయి .సహజత్వానికి దగ్గరగా ఉంటాయి. మనుషుల మధ్య బంధాలు అనుబంధాలు కృత్రిమత్వం ఎక్కడ ఉండదు. సాయం అంటే ఒక అడుగు ముందు సహాయం అంటే అందరికంటే ముందు ఉండే జనంతో నిండుగా ఉండేది పల్లెటూరు. చేతిలో చెర్నాకోలు పట్టుకుని నాగలి కి రెండు ఎడ్లు కట్టుకుని వాటిని అదిలిస్తూ బురద తొక్కుకుంటూ పొలం దున్నుతూ చేతులు బొబ్బలెక్కిన కర్తవ్య నిర్వహణ ఆపకుండా ఆ పొలంలో బంగారం పండించడానికి కృషి చేసే రైతన్నల అడ్డా మన పల్లెటూరు. పల్లె పదాలు పాడుకుంటూ ఊడ్పు చేలో మొక్కలు నాటే పల్లె పడుచులు ఉండే ఊరు పల్లెటూరు. పైరు ఎదిగి పూతపూసి గింజ కాసి గింజల బరువుకి నడువొంగి న పైరు తల్లిని కోత కోసి జోడెడ్లతో నూర్పించి దూళి వేరుచేసి బంగారు రాశులు ఇంటికి చేర్చే రైతన్నల సంతోషం ప్రతి సంక్రాంతి పండుగ కి వాకిళ్లలో చుక్కల ముగ్గు గా వెలుగుతున్న ఊరు పల్లెటూరు.   మా అమ్మ అన్నపూర్ణ. మేము రైతన్నలము. మేము చేసేది వ్యవసాయం. గాల్లో ఎగిరే పక్షికి ,...

పార్టీ

పార్టీ  రంగ మ్మా ఈరోజు రాత్రి మన ఇంట్లో పార్టీ ఉంది. అయ్యగారి బంధువులు స్నేహితులు చాలా మంది వస్తారు. గుమ్మానికి బంతిపూల దండలు కట్టు. కర్టెన్ లన్ని మార్చెయ్యి. ఇల్లంతా తడి గుడ్డు పెట్టు . డైనింగ్ టేబుల్ మీద పింగాణీ సామానంతా పెట్టు. వాటర్ బాటిల్స్ తెప్పించు.భోజనంలోకి ఒక స్వీట్ హాట్ బిర్యాని సాంబార్ అన్నం ఒక వేపుడు అప్పడాలు వడియాలు రెడీ చెయ్యి అంటూ గబగబా చేయవలసిన పనులు లిస్టు చెప్పేసింది ఆ లంకంత కొంపకి యజమానురాలు సుమిత్ర. సుమిత్ర భర్త సుధాకర్ గారు పెద్ద సివిల్ కాంట్రాక్టర్. చాలా పెద్ద పెద్ద వాళ్లతో పరిచయాలు. బాగా సంపాదించాడు. సుమిత్ర గారికి ఇద్దరు మగపిల్లలు. సిటీలో బాగా పేరు మోసిన స్కూల్లో చదువుకుంటున్నారు. రంగమ్మ కూడా అదే కాలనీలో గెడ్డ పక్కన రేకుల షెడ్డులో కాపురం ఉండి ఆ చుట్టుపక్కల పది ఇ ళ్లలో పాచి పని చేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ కాలక్షేపం చేస్తోంది. భర్త ఆటో నడుపుకుంటూ ఉంటాడు. సుమిత్ర గారికి పిల్లల్ని బయటకు పంపించడం భయమేసి రంగమ్మ పిల్లల్ని క్రికెట్ ఆడుకోవడానికి రమ్మంటారు ప్రతి ఆదివారం .సుమిత్ర గారి పిల్లలతో రంగమ్మ పిల్లలు రాజు ,రవి క్రికెట్ ఆడుకుంటూరు. క్రమేపి వాళ్...

కుటుంబం

కుటుంబం ఉదయం ఆరు గంటలు అయింది.  ఆ వృద్ధుల ఆలయంలో మైకు నుంచి విష్ణు సహస్రనామం శ్రావ్యంగా వినపడుతోంది.  ఒంటిమీద తెల్లటి బట్టలు వేసుకుని కాళ్లకు నల్లటి షూ తొడుక్కుని నుదుటన ఎర్రటి బొట్టు పెట్టుకుని సగం సగం నెరిసిన జుట్టుతోసుమారు యాభై ఏళ్ళ వయసు ఉన్న ఒక వ్యక్తి  ప్రతి గది లోకి తొంగిచూస్తూ అక్కడున్న వృద్ధులను ఆప్యాయంగా వరుసలు కలిపి పలకరిస్తున్నాడు.  "పెద్దమ్మ కాఫీ తాగావా! పెద్దనాన్న లేచావా! ఆరోగ్యం బాగుందా! మందులు వేసుకున్నావా! రాత్రి నిద్ర పట్టిందా! ఇలాంటి ప్రశ్నలతో ఆ వృద్ధులందరినీ పలకరించడం ఆయన దినచర్య. ఆ వృద్ధుల ఆలయంలో సుమారు యాభై గదులు ఉంటాయి. ప్రతిరోజు ప్రతి గదిని నిశితంగా పరిశీలించి బాగోగులు కనుక్కోవడం ఆయనకి ఇష్టం. తనకంటూ ఎవరు అయినవాళ్లు లేకపోయినా , అయినవాళ్లు ఉండి కొందరు, ఎవరూ లేకుండా ఆ వృద్ధుల ఆలయంలో చేరిన ప్రతి ఒక్కరిని తన బంధువు లాగే చూసుకుంటాడు . మర్యాదలు చేస్తాడు. కష్టం వస్తే తల్లడిల్లిపోతాడు. ఎవరికైనా అనారోగ్యం వస్తే రాత్రి పగలు తేడా లేకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. అలా ప్రతి గదిలోకి తిరిగి భోజనాశాలలోకి వెళ్లి అందరూ పలహారం తీసుకునే వరకు అక్కడే కూర్చ...

మార్పు

మార్పు నాన్న ఈసారి మీరు తప్పకుండా నాతో పాటు రావాలి. నేను ఎప్పటి నుంచో అడుగుతున్నాను మీరు దాటేస్తున్నారు. మా కొలీగ్ తల్లిదండ్రులందరూ వచ్చి ఆరేసి నెలలపాటు ఉంటారు. మీరేమో నా మాట వినరాయే. నాకు చాలా బాధగా ఉంది అంటూ అమెరికా కొడుకు సురేష్ మాటలు విని చూద్దాం లేరా అoటు గొణుక్కుంటూ తన గదిలోకి వెళ్లిపోయారు చిరంజీవి గారు. సురేష్ కిఅమెరికాలో ఉద్యోగం వచ్చి ఆరు సంవత్సరాలు అయింది. సురేష్ ఉద్యోగం వచ్చినప్పటి నుంచి తండ్రి బాధ్యతలు పంచుకుంటూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటూ వచ్చాడు. చిరంజీవి గారికి నలుగురు మగపిల్లలు ఒక అమ్మాయి . చిరంజీవి గారి భార్య నాలుగు సంవత్సరాల క్రితమే చనిపోయింది. ముగ్గురు కొడుకులు భార్యలు మన వళ్ళతో ఆ ఊర్లోనే కాలక్షేపం చేస్తున్నాడు చిరంజీవి గారు. సురేష్ చదువు కోసం తండ్రి చేసిన అప్పులు తీర్చి అన్నగారి కొడుక్కి గుండె ఆపరేషన్ చేయించి తండ్రి కోరిక ప్రకారం ఆ గ్రామంలో ఒక మంచి ఇల్లు కట్టించాడు. అయితే సురేష్ తనకంటూ ఒక పది పైసలు దాచుకోలేదు. పెళ్లి కూడా అయ్యింది .ఇద్దరు పిల్లలు. పాపం డబ్బంతా మనం వాడేస్తే ఎలాగా అనేది సురేష్ తండ్రి చిరంజీవి గారి ఆలోచన. చిరంజీవి గారు బ్రాహ్మణ కుటుంబానికి చ...

ముందు జాగ్రత్త

ముందు జాగ్రత్త  ఒరేయ్ రెడ్డి ఉదయం లేచి పిఠాపురం పశువుల సంతకు వెళ్లాలి అoటు రామారెడ్డి తన కొడుకు శ్రీనివాసరెడ్డి తోటి మంచం మీద పడుకుంటూ చెప్పాడు. మనకు పశువులు ఎందుకు నాన్న పొలాలన్నీ అమ్మేశాముగా అంటూ కొడుకు ప్రశ్నించాడు. లేదు రేపు ఉదయం తప్పకుండా వెళ్లాలి. బస్సు మీద కాదు మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోదాం అంటూ సమాధానం ఇచ్చాడు రామారెడ్డి. తండ్రి మనసులో ఉన్న మాట చెప్పలేదు ఎందుకో తెలియదు అయినా తండ్రి మాటంటే శ్రీనివాస రెడ్డికి చాలా గౌరవం. సరే నాన్న తెల్లవారుజామున బయలుదేరుదాం అంటూ ఇద్దరు మంచం మీద వాలేరు. రామారెడ్డి ఒకప్పుడు బాగా చదువుకున్న మోతుబరి రైతు. కాలక్రమేణా పంటలు సరిగా పండక పిల్లల పెళ్లిళ్లు చేసి పేరంటాలు చేసి ఆస్తంతా ఖర్చు అయిపోయింది. రామారెడ్డి దైవభక్తిపరుడు. పూజలు పునస్కారాలు అంటే బాగా ఇష్టం.ఎప్పుడు గుళ్ళుతిరుగుతుంటాడు. ఆ సొంత ఊర్లోనే తన తాతలనాటి కొంపలోకొడుకు కోడలు భార్యతో కాలక్షేపం చేస్తున్నాడు.  పొలాలూ ఉన్న రోజుల్లో ఇంటి వెనక పశువుల పాకలో ఎప్పుడు పది ఆవులు ఉండేవి. ఎద్దుల తోటే వ్యవసాయం చేసేవాడు. ఆ పశువులని నిత్యం దైవంగా పూజించేవాడు. కాలం కలిసి రాక ఆస్తి అంతా పోయింది కానీ భూ...

దేవుడు వేసిన శిక్ష

దేవుడు వేసిన శిక్ష. ఉదయం 5:30 గంటలయింది. శీతాకాలం కావడంతో జన సంచారం పెద్దగా లేదు.ఎప్పుడు డ్యూటీ కరెక్ట్ గా చేసే బాలభానుడు ప్రపంచానికి వెలుగు చూపి ఆ గోదావరి నదిలో తన అందం చూసుకుంటున్నాడు. ఏరా రాజు బారెడు పొద్దెక్కింది ఇంకా మంచం మీద నుంచి లేవలేదా గోదావరిలోకి వెళ్ళవా అంటూ తల్లి కసిరిన కేకతో మంచం మీద నుంచి బద్దకంగా లేచి దుప్పటి మడతపెట్టి గూట్లో ఉన్న వేప పుల్ల తీసుకుని నోట్లో పెట్టుకుని గోదావరి ఒడ్డుకి  పరిగెత్తాడు. ఏదిక్కు లేకపోతే గోదావరే దిక్కు అంటారు కదా. అలాగే అభాగ్యులందరికీ గోదావరి తీరం కడుపు నింపుతుంది  అలా రాజుకి బ్రతకడానికి ఆ గోదావరి ఆధారం. ఆ గోదావరి తీరంలోని చిన్నపాక లో వారి కాపురం. నిండా పదేళ్లు కూడా ఉండవు. కుటుంబానికి ఆధారం వాడే. ఆ చిన్న వయసులో ఏం పని చేయగలడు అనే ఆలోచన అందరికీ వస్తుంది.  ఇంతకీ గోదావరి రాజు కడుపుఎలా నింపుతోంది. రాజమహేంద్రవరానికి ప్రత్యేక ఆకర్షణ ఈ గోదావరి. ఆ గోదావరి నది మీద నిర్మించిన వారధి మీద రోజు ఎన్నో రైళ్లు అటు ఇటు తిరుగుతుంటాయి.  విజయవాడ వైపు వెళ్లే రైళ్లు విశాఖపట్నం వైపు వెళ్లే రైళ్లు తప్పనిసరిగా ఈ వారధి దాటే వెళ్లాలి. అందుకే ఈ బ్రిడ్జి...

సీత జీవితం

సీత జీవితం  ఇల్లంతా పెళ్లి సందడితో హడావిడిగా ఉంది. గుమ్మానికి మామిడి తోరణాలు ఆకాశమంత పందిరి హాలంతా డెకరేషన్ చాలా అందంగా ఉంది. అక్కడ హల్దీ కార్యక్రమానికి డ్యాన్సులతో బంధువులంతా బిజీగా ఉన్నారు. పెళ్లికూతురు సీతాదేవి గారిని రెండు చేతులుండా గోరింటాకు పెట్టి కుర్చీలో కూర్చోబెట్టారు. కొందరు గోరింటాకు పెట్టించుకునే హడావుడిలో కొందరు డాన్స్ లు హడావిడిలో హాలు అంతా ఆనందంగా ఉంది.  పెళ్లి పెద్దలు ఇద్దరూ హడావిడిగా అటు ఇటు తిరుగుతున్నారు. వథూవరుల వయసు ఎంత ఉంటుందో ఊహించగలరా . ఇద్దరు వృద్ధ దంపతులు . ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇంతకీ పెళ్లి కూతురు ఎవరు. ఇద్దరు బిడ్డల తల్లి . కడుపున పుట్టిన పిల్లలు తల్లికి పెళ్లి చేయడం మరీ వింతగా ఉంది కదా. వింత కాదండి. ఇంతకీ పెళ్లి వెనుక అసలు కథ ఏమిటి. సీతా దేవి గారు తల్లిదండ్రులకి ఏకైక కుమార్తె. తండ్రి నారాయణ మూర్తి గారు వేద పండితుడు. ఆచార సాంప్రదాయాలకు విలువనిచ్చేవాడు. లేక లేక పుట్టిన ఆడపిల్లని చాలా కట్టుబాట్లుతో పద్ధతిగా పెంచాడు. ఆ ఊర్లో ఉండే ప్రాథమిక విద్య తోటి చదువు ఆపించేసి ఇంటి వద్దనే సంస్కృత పాఠాలు పురాణాలు సంగీతం నేర్పించాడు. సీతా దేవి గారు కూడా చాలా...