పెళ్లి దొంగ
పెళ్లి దొంగ " అయ్యా సోమేశ్వరావు గారు ఇరవై ఇత్తడి గ్లాసులు లెక్కకు తక్కువయ్యాయి. అన్నిచోట్ల వెతికాము. ఆరోజు లెక్క కట్టి అప్పచెప్పాము మీకు .వీటి ఖరీదు మీరు భరించవలసిందే. మీరు ఇచ్చిన అడ్వాన్స్ లో వీటి ఖరీదు తగ్గించుకుంటాము అంటూ కన్యకా పరమేశ్వరి సత్రం గుమస్తా చెప్పిన మాటలకు తల తిరిగిపోయినట్లు అయింది సోమేశ్వరావుకి. ఈ మాటలు ఎవరైనా వింటే పరువు కూడా పోతుంది అనుకుని ఈ ఇత్తడి గ్లాసులు ఎవరు పట్టుకెళ్ళిపోయారబ్బా పనివాళ్ళు తీసుకెళ్లే ఆస్కారం లేదు. బయట పని వాళ్ళు ఎవరూ రాలేదు.మన బంధువులలో అలాంటి వాళ్ళు ఎవరూ లేరు. ఇంకా మగ పెళ్లి వారు ఆ మాట పైకి అనడానికి వీలు లేదు. మమ్మల్ని అనుమానించావని దెబ్బలాడుతా రు. అవును ఆ ఇత్తడి గ్లాసులు దుక్కల్లా ఉన్నాయి. పెళ్ళి వారి విడిదిలోకి కాఫీ కోసమని మంచినీళ్ల కోసం అని పంపించిన గ్లాసులు. బాగా గుర్తున్నాయి. ఏమిటో ఈ సమస్య. ఏమీ ఎవరిని అడగడానికి వీలులేదు. పైకి మాట్లాడుకోవడానికి వీల్లేదు. అయినా కానీ పొరపాటున తీసుకుని వెళ్ళిపోయారు అంటే అవి చాలా బరువు కూడా ఉన్నాయి. ఇది కావాలనే పట్టుకెళ్ళిపోయారు. మగ పెళ్లి వారిలో ఇద్దరు ఆడవాళ్లు ఆ సత్రం అంతా ఎప్పుడు తిరుగు...