మరుగున పడ్డ కథ
మరుగున పడ్డ కథ " ఏవండీ వినాయక చవితి ఉత్సవాలు వస్తున్నాయి. ఈసారైనా కనీసం నాలుగు ప్రోగ్రాములు కుదిరితే బాగుండు ను. కనీసం పండగ రోజుల్లో కూడా ఎవరు మీ ప్రోగ్రాం పెట్టించుకోవడానికి రావడం లేదు. ఇదివరకైతే ఎప్పుడూ ఖాళీ ఉండేది కాదు. వినాయక చవితి ,దసరా ఉత్సవాలు, దీపావళికి, కార్తీక మాసం సంక్రాంతి సంబరాలు, శివరాత్రి ఉత్సవాలంటూ ఇంచుమించుగా ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రాం ఉండేది. ఏదో శాపం తగిలింది. కనీసం బతిమాలుతున్న ఎవరు ఈ ప్రోగ్రాం పెట్టించుకోవడం లేదు. ఏమిటో ఈ రోజులు? కాలం మారిపోయింది ప్రాచీనమైన కళలన్నీ మరుగున పడిపోతున్నాయి. ఈ కళనీ నమ్ముకుని బతుకుతున్న మనలాంటి కుటుంబాలకి గడిచేది ఎలాగా? గతంలో ప్రతి ఏడాది మీ ప్రోగ్రామ్ తప్పనిసరిగా ఉండేది కదా పల్లిపాలెం వినాయక చవితి ఉత్సవాల్లో ,వాళ్లు పిలవకపోతేనే మీరే ఒక్కసారి వెళ్లి అడిగి వస్తే మంచిది కదా !అవసరం మనది అనీ చెప్పింది పతంజలి శాస్త్రి భార్య సుమతి. "చూడండి పండగ పూట కనీసం పచ్చడి మెతుకులతోనైనా పిల్లల కడుపు నింపాలి కదా!. ఇంక అంతకంటే మీకు నేను ఏం చెప్పను?. మనం ఏదో సర్ది చెప్పుకుని పడుకుంటాం, పిల్లలు ఎలాగండి ?అని చెప్తున్న భార్య మాటలకి దుఃఖం వచ్చింది...