అవ్వ
ఒకరు పొద్దు వాలిన సూరీడు
మరొకరు ఉదయిస్తున్న భానుడు.
కాలమంతా కరిగిపోయిన అవ్వకి
పొద్దు పోయేలా చేస్తోoది బుడ్డిది
ముందు కాలం అంతా నాదేనంటూ
అవ్వతో ఊసులాడుతోంది చంటిది.
ఒకరికి ఒకరు తోడు
ఒకరంటే ఒకరికి గుండెల్లో ప్రేమ
ప్రేమ చెప్పినా తెలియనిది ఒకరికి
కళ్ళల్లోనే తన ప్రేమ చూపించేది మరొకరు
బిడ్డ మూగ ప్రేమ ,అనుభవం ఉన్న అవ్వకే తెలుసు.
అవ్వ ఊసులో ఏ పరిహాసాలు ఉన్నాయో
ఆ ముదుసలిలో ఏ బొమ్మ కనబడిందో
కిలకిలా నవ్వుతోంది బుడ్డిది.
పలకరించే నాధుడు లేక
పులకరించేలా నవ్వుతున్న
బుడ్డి దానితోటే కాలక్షేపం చేస్తోంది అవ్వ
అనుభవo ఉన్న అవ్వ పొత్తిళ్ళలోనే
ఆప్యా యత అనుభవిస్తోంది చంటిది.
ఆప్యాయత అనురాగoతో పెరిగిన
అవ్వ నీడలో ఈ బొమ్మ భవితంతా బంగారు.
పరిగెత్తే పంచకళ్యాణికి కళ్లెం వేసి
నిదానమే ప్రధానమని చెపుతుంది.
విక్రమార్కుడు గురించి చెబుతుంది
కాశీ మజిలీ కథలు చెబుతుంది
రామాయణ భారతాలు చూసినట్లుగా చెబుతుంది
తన అనుభవం కథలు కథలుగా చెబుతుంది.
అనుభవం నుంచే కదా మనిషి గుణపాఠం వచ్చేది.
అందుకే ఇంటికో అవ్వ ఉండాలి.
అవ్వని మాత్రం గుమ్మం దాటించేయకండి.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి