మన విశాఖ

మన విశాఖ

ఉక్కు నగరo కాదు
ఉర్రూతలు ఊగించే నగరం
విశాలమైన నగరం
మనోవికాసానికి సరియగు స్థలం.
మన విశాఖ నగరం.
విహారయాత్రలకు అనువైన స్థలం

ఉక్కు లాంటి పట్టుదల
సాగరం లాంటి మనసు
నిత్యం అప్పన్న ఆశీర్వాదం
 కలిమికి కనకమహాలక్ష్మి అండ
సంపదలు ఇచ్చే సంపత్ వినాయకుడు
విశాఖ వాసులకు అదే అదృష్టం

సుందర నగరం మీదుగా జాతీయ రహదారి
నడిరేయిలో కూడా నగరం చేర్చే సౌకర్యమే హాయి
నాలుగు చక్రాల బండి ఉంటే సరే సరి
షికారుకి సాగర తీరాలన్నీ రెఢీ

సంపత్ వినాయకుడికి అభిషేకం చేసుకుని
కనకమహాలక్ష్మి పూజ ముగించుకుని
విహారయాత్ర విజయంగా జరగాలని
యారాడ వైపు దారి తీద్దాo.

ముచ్చటగా మూడు దిక్కుల కొండలు
నాలుగోదిక్కు నీలి రoగు సముద్రం
యారాడ సాగర తీర విహారం
ప్రతి మనిషికి ఉత్సాహo

ఆ సాగరానికి కొండలకి మధ్య అనుబంధం
ఆటుపోటులు ఎన్ని వచ్చినా కొండకి కరగని ధైర్యం
జలకాలాడే చేప పేరు ధరించి
ఆ కొండ తీర్చుకుంది రుణం.
కొండ ఎక్కించి నగరవాసులకు చూపుతోంది సాగరమంతా
అదే డాల్ఫిన్ నోస్.

ఆ సాగర తీరం ఋషులుగా మారుస్తుంది
అలలన్నీ పాదాలకు తాకి మనసును అందలం ఎక్కిస్తుంది
అది ఒక అనిర్వచనీయమైన అనుభూతి.
అది రుషులు లేని ఋషికొండ 

వయస్సుతో నిమిత్తం లేదు
పడి లేచే కెరటం చూస్తే
మనసు ఉరకలేస్తుంది
వయస్సు సాగరంలో ఈత కొడుతుంది.
అయితే పదండి రామకృష్ణ బీచ్

సాగర తీరమంటే అందరికి సేద తీరుస్తుంది
అందుకే కాబోలు ఈ జలాంతర్గామి 
ఏకంగా ఇక్కడ కాపురం పెట్టేసింది.
సందర్శకులు ఆహ్వానించి తన విజయాలన్నీ చూపిస్తుంది.

ఆకాశంలో ఎగిరే విమానం చూసాం
నేల మీద నడిచే బస్సును చూసాం
పట్టాల మీద పరిగెత్తే రైలు బండిని చూసాం.
తాడు మీద పరిగెత్తే ట్రాలీని ఎక్కి గిరిప్రదక్షిణ చేసేద్దాం
అదేనండి కైలాసగిరి

అడవి అంతా నగరానికి వచ్చేసింది
జంతుజాలమంతా బోనెక్కేసింది
పిల్లల కేరింతలకు కారణమయ్యింది
పదండి ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్.

బాగా అలసిపోయారు కదా
బాగా ఆకలి వేస్తోంది కదూ
పదండి సాయిరాం పార్లర్
విశాఖ కే వన్నె తెచ్చిన ఫుడ్ కార్నర్.

మ్యూజియం అంటే ఒక సంస్కృతికి దర్పణం.
గత చరిత్ర వైభవాన్ని ,అనుభవాల్ని 
తరతరాలకి పంచడానికి మనలో దేశభక్తి పెంచడానికి
నిర్మించబడ్డ అందాల ఆలయం మ్యూజియం.
పాక్ యుద్ధంలో నావికాదళం సాధించిన విజయం
బీచ్ రోడ్ లోని విక్టరీ ఎట్ సీ వార్ మెమోరియల్ 

బతుకంతా గాలిలోనే గడిపి 
30 వేల గంటలు గాలిలోనే ఎగిరి
విశ్రాంతికి ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియంలో చేరింది
టి యు 142 విమానం.
రండి చూద్దాం

రాజకీయ నాయకుల పేర్లు పెట్టుకుని
విశాఖ వాసులకు సేద తీరుస్తున్నాయి
తెన్నేటి పార్కు వైయస్సార్ పార్క్

అది వుడా పార్క్ కాదు
హృదయాన్ని రంజింప చేసే పార్కు

హమ్మయ్య నగరం అంతా చుట్టేసాం
రాస్ హిల్ చర్చి ఎక్కి యేసుని దర్శిద్దాం

బొజ్జన్న కొండలోకి దూరి గౌతమ్ బుద్ధుడిని
కంబాలకొండ పైన అభయారణ్యము సందర్శిద్దాం పదండి.

విహారయాత్రలు అన్నీ అయిపోయాయి
తీర్థయాత్ర మిగిలింది
అప్పన్న కొండెక్కి ఆశీర్వాదం పొందుదాం

విశాఖ విహారయాత్రలకు పెట్టింది పేరు
 ఈ నగరాన్ని అందంగా మలిచింది ప్రకృతి

రచన మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
         కాకినాడ 9491792279.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆరోగ్యం వర్సెస్ ఆహారపు అలవాట్లు

సామర్లకోట

కుటుంబం