పోస్ట్‌లు

నా రథం

చిత్రం
పుట్టడం అందరి బిడ్డలులాగే అమ్మ కడుపున. ఎవరి దిష్టో పోలియో శాపo పసిప్రాయంలో. మానవుడి జీవిత గమనం రెండు కాళ్ళతో. నా జీవిత గమనానికి మూడు కాళ్లు .           అందుకే నేను ప్రత్యేకం.           దాని తోటే నా జీవితం.       అదే మూడు చక్రాల రథం.   దేవుళ్ళు ప్రతి పండక్కి రథంలో ఊరేగింపు   నేను నారథoతో పాటు ప్రతి చోట విహరింపు.      ప్రతి ఆశయానికి గమనం ముఖ్యం       నా ప్రతి ఆశయ సిద్ధికి నా రథం నా అదృష్టం.      నా బిడ్డలు నా రథానికి వెనకుండే చక్రాలు.      ముందుండి నడిపించే ముద్దుల చక్రం భార్య .      కుటుంబ సభ్యులు నా మార్గదర్శకులు.    బతుకు జట్కా బండి కాదు.  రాజధాని express రైలే.        మూడు చక్రాల రధం ఎంతో పరోపకారి.   నా అభివృద్ధికి ఎంతో ఉపయోగకారి.   నా లాగే బండి కూడా సహనం ఎక్కువ. పనిభారం పెరిగనా పల్లెత్తు మాట్లాడను వయసుతో పాటు నా భారం పెరిగిన కిమ్మనకుండా గమ్యం చేరుస్తుంది నా బంగారు రథం. న...

అవ్వ

చిత్రం
ఒకరు పొద్దు వాలిన సూరీడు మరొకరు ఉదయిస్తున్న భానుడు. కాలమంతా కరిగిపోయిన అవ్వకి పొద్దు పోయేలా చేస్తోoది బుడ్డిది ముందు కాలం అంతా నాదేనంటూ  అవ్వతో ఊసులాడుతోంది చంటిది. ఒకరికి ఒకరు తోడు ఒకరంటే ఒకరికి గుండెల్లో ప్రేమ ప్రేమ చెప్పినా తెలియనిది ఒకరికి కళ్ళల్లోనే తన ప్రేమ చూపించేది మరొకరు బిడ్డ మూగ ప్రేమ ,అనుభవం ఉన్న అవ్వకే తెలుసు. అవ్వ ఊసులో ఏ పరిహాసాలు ఉన్నాయో ఆ ముదుసలిలో ఏ బొమ్మ కనబడిందో కిలకిలా నవ్వుతోంది బుడ్డిది. పలకరించే నాధుడు లేక   పులకరించేలా నవ్వుతున్న బుడ్డి దానితోటే కాలక్షేపం చేస్తోంది అవ్వ అనుభవo ఉన్న అవ్వ పొత్తిళ్ళలోనే   ఆప్యా యత అనుభవిస్తోంది చంటిది. ఆప్యాయత అనురాగoతో పెరిగిన అవ్వ నీడలో ఈ బొమ్మ భవితంతా బంగారు. పరిగెత్తే పంచకళ్యాణికి కళ్లెం వేసి నిదానమే ప్రధానమని చెపుతుంది. విక్రమార్కుడు గురించి చెబుతుంది  కాశీ మజిలీ కథలు చెబుతుంది రామాయణ భారతాలు చూసినట్లుగా చెబుతుంది  తన అనుభవం కథలు కథలుగా చెబుతుంది. అనుభవం నుంచే కదా మనిషి గుణపాఠం వచ్చేది. అందుకే ఇంటికో అవ్వ ఉండాలి. అవ్వని మాత్రం గుమ్మం దాటించేయకండి. రచన మధునాపంతుల చిట్టి వెంకట...

పెళ్లి కాజా

పెళ్లి కాజా. "అయ్యా గోపాలకృష్ణ గారు పెళ్లి వారిని భోజనానికి పిలవవచ్చునా! వంట సంగతి ఏమిటి? అంటూ అడిగిన కన్యాదాత చలపతిరావుకి నిరభ్యంతరంగా పిలవచ్చు. మీరు చెప్పిన వంటలన్నీ రెడీగా ఉన్నాయి అన్నాడు గోపాలకృష్ణ. బంగాళదుంప కూర, వంకాయ జీడిపప్పు సాంబారు అప్పడాలు వడియాలు కంది పొడి ఆవకాయ వీటన్నిటితో పాటు కాజాలు, జిలేబి వడ్డించండి. పిండి వంటలన్నీ ఆ మూల గదిలో పెట్టించాను. వడ్డనకి ఊరి వారు సరిపోతారా! మా కుర్రాళ్లను కూడా పంపించినా అవసరమైతే నేను కూడా వస్తాను. మీరు బంతి వేసే లోపు నేను అన్నం వార్చుతాను అంటూ గాడి పొయ్యి దగ్గర స్టూల్ మీద కూర్చున్న వంట బ్రాహ్మణుడు గోపాలకృష్ణ చెప్పాడు చలపతిరావు తో. సదరు గోపాలకృష్ణ వంటలు వండడంలో పిండి వంటలు చేయడంలో ఆరితేరిన వ్యక్తి. నల్లగా పెద్ద బొజ్జతో పొట్టిగా ఉండి ఎర్రటి అంగవస్త్రం కట్టుకుని నలుగురు కుర్రాళ్లను వెంటబెట్టుకుని ఎంతటి పెళ్లి వంట అయిన రుచికరంగా శుభ్రంగా తయారుచేసే ఆ గోపాలకృష్ణ కాకినాడ నివాసి.  ఆ ఊర్లో చిన్న తోరణం కడితే చాలు వంటకి గోపాలకృష్ణ నే పిలిచేవారు.అంత అలవాటు పడిపోయారుఆ ఊరి జనం గోపాలకృష్ణ వంటకి.  గోపాలకృష్ణ వంటలో ఉన్నాడంటే నిశ్చింతగా ఉంటాడు యజమా...