🚨 పోలీస్
వానల్లో వరదల్లో కాశ్మీర్ అల్లర్లలో
కరోనా లాక్డౌన్ లో రాష్ట్ర విపత్తు లో
కంటిపాపలా కాపాడేది పోలీస్.
రాత్రి పగలు తేడా తెలియని డ్యూటీ.
పండగ నాడు పబ్బం నాడు పై వాడి పని.
రెస్టు లేని మొరటు తేలిన జీవితం
ఇస్త్రీ చెదిరిన ఖాకీ డ్రెస్సు.
నిరంతరం టోపీ ధారణo.
బట్ట తలే దాని బహుమానం.
చేతిని గుంజుతున్న తుపాకీ.
మొలకి బిగించిన తుపాకీ గుండు.
అది ఎప్పుడూ పక్కలో బల్లెం..
వారి డ్యూటీ అందాల ఏసీ గదుల్లో కాదు.
కొండా కోనల్లో ఎండా వానల్లో
అడవి అన్నల ఎదురు దాడుల్లో.
దేశ రక్షణ కర్తవ్యం .
ఆత్మరక్షణ అనుమానం.
ట్రాఫిక్ కంట్రోల్ తో సతమతం.
చెవుల్లో ట్రాఫిక్ రొద .
వాహనపు పొగ .
ఊపిరితిత్తులకు సెగ.
నిబంధనలు పాటించని జనం.
మితిమీరిన వేగం.
పెరుగుతున్న యాక్సిడెంట్లు.
రాత్రంతా శవ జాగరణం.
విసుగూ విరామం లేని జీవితం.
నిర్ధారణ లేని పనిగంటలు.
వెరసి పోలీసు జీవితం.
ప్రపంచమంతా నిద్రపోతే
మేల్కొని ఉండేవాడు పోలీసు.
చలన చిత్రం తన పాత్రను వ్యంగంగా చూపితే.
నవ్వుకొనేది పోలీస్.
వయసులో చిన్నవాడైన పెద్దయ్య గారికి
ఆత్మాభిమానం చంపుకుని కొట్టే సెల్యూట్.
అయ్యగారు చెప్పే ఆ పని ఈ పని డ్యూటీ లో అదనం.
తరతరాలుగా పోలీసులకి అదే జీవితం.
పెరుగుతున్న టెక్నాలజీ కొంత సహాయం.
ఇంకా మారాలి వారి జీవితం.
అడగ్గానే సెలవు ఇచ్చే పెద్ద బాసు .
సెలవులో నుండి వెనక్కు పిలివని చట్టం.
ఖాళీలు పూరింపు పనిగంటల తగ్గింపు.
ఆరోగ్య భద్రతకు చట్టంలో మార్పు.
ఆత్మరక్షణకు భద్రత పెంపు.
పోలీసుల చట్టంలో చేయవలసిన మార్పు.
అదే వారి జీవితాలకి పెను మార్పు.
పోలీసులు రక్షకులు భక్షకులు కాదు.
రావాలి పోలీసులు మనస్తత్వంలో మార్పు.
అప్పుడే పెరుగుతుంది ప్రజలతో సన్నిహిత సంబంధం.
ప్రజల నుండి అందుతుంది సహకారం.
శాంతి భద్రతల తో దేశం సంతోషం.
నిన్ను పోలీస్ ఉద్యోగానికి పంపిన అమ్మకిసెల్యూట్.
నిప్పులు కక్కే తూటా నీ గుండె చీలిస్తుందని తెలిసిన
ఆమె గుండె ధైర్యమే నీకు మనో ధైర్యం..
అమ్మకు వందనం.
పోలీసువారికి వందనం.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.
కాకినాడ9491792279
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి