కాలం నీది కాదు

కాలం నీది కాదు
 నాది కాదు.
కాలం ఎవ్వరిది కాదు

కాలం అందరినీ మురిపిస్తుంది
కాలం అందరినీ మరిపిస్తుంది

భయంతో వణికిస్తుంది
బాధ్యతగా ముందుకు నడిపిస్తుంది.

ఎవ్వరి గురించి ఆగదు.
ముందుకు పరిగెడుతూనే ఉంటుంది

రోజులు నెలలు సంవత్సరాలు
ఇవే కదా కాలానికి కొలమానం

ఎవరి కాలం ఎలా ఉందో ఎవరికి తెలుసు
ఏ క్షణం ఎవరిదో ఎవరికి ఎరుక.

రేపు అనేది నాది కాదు అన్నది ఎవరికి తెలుసు
భవిష్యత్తు ప్రణాళిక వేసుకుంటాం
బాధ్యతగా పనులు మొదలుపెడతాం
కాలం సహకరించకపోతే ఏం చేస్తాం.
అదే ఆఖరి రోజని ఎవరికి తెలుసు.
ఊపిరి ఉన్న రోజే మన రోజని పెద్దలకు తెలుసు

ఎంతో కాలం ఉందని అనుకుంటాం
సమయం ఆసన్నమైతే ఊపిరి తీస్తుంది.
సమయం వస్తే ఊపిరి పోస్తుంది.

తీర్చవలసిన బాధ్యతలు
తీర్చుకోవాల్సిన రుణాలు
వేటిని లెక్కచేయదు.

నిర్దయగా తన పని తాను చేసుకుంటూనే పోతుంది.
కాలం కర్కశ మైనది.
దయా దాక్షిణ్యాలు ఉండవు.

పాల బుగ్గల పసివాళ్లకు అమ్మను దూరం చేస్తుంది.
దాంపత్య బంధాన్ని మధ్యలోనే తుంపేస్తుంది.

కాటికి కాళ్ళు చాపుకుని ఉన్న వాళ్ళని
కర్త గా ముందు నడిపిస్తుంది.

ఆత్మీయులను అయోమయంలోకి నెట్టివేస్తుంది
కన్నవాళ్ళ కడుపు తీపి పట్టించుకోదు.

బతుకంటే భయం పుట్టేలా చేస్తుంది
రానున్న ఉపద్రవం ముందుగా చెప్పదు.
రాగల ప్రమాదం అసలు చెప్పదు.

గుంభనగా ఉంటుంది గుట్టు విప్పదు.
క్షణంలో జరిగేది చెప్పదు.
కాలం కొట్టే దెబ్బ గుండెల్ని తాకుతుంది.

కన్నవాళ్లు అంది వచ్చారని రంగుల లోకం ఊహించుకుంది ఓ ఇల్లాలు
పెట్టే బేడా సర్దుకుంది.
 గాల్లో ప్రయాణం చేయాలని కలలు కంది.
మంచివాళ్ళు అంటే దేవుడికి ఇష్టం
ఏదో మాయరోగం పెట్టి తన దగ్గరకు లాక్కుంటాడు
ఏదో ఉపద్రవం ముoచుకొచ్చింది 
నీటి బుడగలా ప్రాణం గాలిలోనే కలిసిపోయింది.
కళ్ళ ముందు జరిగిన సంఘటన
కన్నీళ్లు తెప్పిస్తూనే ఉంది
మనకు తెలిసిన సంఘటన.
తెలియని చరిత్రలు ఎన్నో 
కాల మహిమలు ఎన్నో.
ఎవరి కాలం ఎలా ఉందో
కాలానికి రూపం ఉండదు
మహిమ తప్పితే

గుడులు గోపురాలు ఉండవు
పూజలు చేద్దామంటే
కాలం కనబడని దైవం మించిన దైవం.
కాలం బాగుండాలని ఆశిద్దాం.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట